
హాంకాంగ్: భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్ భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. ఫలితంగా దాని మాతృ సంస్థ 'బైట్‌డాన్స్'కు దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇదిలా ఉండగా టిక్‌టాక్ హాంకాంగ్ మార్కెట్ నుంచి వైదొలగనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అయితే దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంటు ఇటీవలే జాతీయ భద్రతా చట్టానికి ఆమెదం తెలిపింది. దీంతో అక్కడ నిరసనలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా తీరును ఎండగడుతూ ఒకే తాటిపైకి వస్తున్నారు. (53 మందిని అరెస్టు చేశాం: హాంకాంగ్ పోలీసులు)
దీనిపై కన్నెర్ర జేసిన ప్రభుత్వం హాంకాంగ్‌లో నిరసనలను అణిచివేసేంచుకు టిక్‌టాక్ వినియోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టిక్‌టాక్ నిర్వాహకులతోనూ అక్కడి ప్రభుత్వ అధికారులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ తన కార్యకలాపాలను హాంకాంగ్‌లో నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయానికి రాలేదని స్పష్టం చేసింది. కేవలం అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయానికొచ్చినట్లు వివరించింది. (టిక్‌టాక్ నిషేధంతో భారీగా నష్టపోయిన చైనా)
ఈ చర్యతో 1,50,000 మంది యూజర్లను టిక్‌టాక్ కోల్పోనుంది. కాగా 1997లో బ్రిటన్ నుంచి హాంకాంగ్ చైనా చేతికి వచ్చాక.. ‘‘ఒక దేశం రెండు వ్యవస్థల విధానం’’ కింద హాంకాంగ్‌కు 50 ఏళ్ల పాటు అత్యున్నత స్వయంప్రతిపత్తి, న్యాయ స్వతంత్రత లభించాయి. అయితే హాంకాంగ్ స్వయంప్రతిపత్తి రద్దయ్యేలా చైనా తాజాగా జాతీయ భద్రతా చట్టాన్ని అక్కడ అమలు చేయనున్న నేపథ్యంలో మరోసారి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. (‘చైనా ప్రపంచానికి తలనొప్పిగా మారింది’)