హాకాంగ్ : కరోనా మహమ్మారి మనుషులపైనే కాదు జంతువులపైన కూడా తన ప్రతాపాన్ని చూపుతోంది. హాకాంగ్‌లో ఇప్పటికే రెండు పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. తాజాగా ఓ పెంపుడు పిల్లికి కూడా ఈ మహమ్మారి సోకినట్లు వైద్యులు గుర్తించారు. యజమాని వల్ల పిల్లికి కూడా కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు మార్చి 31న హాంకాంగ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అండ్ కన్జర్వేషన్ డిపార్టమెంట్ ఓ నోటీసులు విడుదల చేసింది.
(చదవండి : కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి)
అయితే దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెంపుడు జంతువుల ద్వారా కరోనా వైరస్ సోకుతుందనే ఆధారాలు ఇంతవరకు లభించలేదని, యజమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు డెరెక్ట్‌గా కరోనా వైరస్ సోకలేదని, యాజమాని లేదా ఇతర మనుషుల ద్వారా అవి వైరస్ బారిన పడ్డాయని స్పష్టం చేశారు. వీటి వల్ల ఎటువంటి ముప్పు లేదన్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకదని, 14 రోజులు వాటిని క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంగీకరించింది. తప్పుడు వార్తలను నమ్మి పెంపుడు జంతువుల ప్రియులు ఆందోళన చెందొద్దని కోరింది.
(చదవండి : అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!)
కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు, మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌లో ఈ వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడి ఇప్పటికే 40 వేల మందికి పైగా మృతి చెందారు. బాధితుల సంఖ్య 8 లక్షలు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment