ప్రాక్టీసు సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు(PC: BCCI Twitter)
Asia Cup 2022- India vs Hong Kong: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా టీమిండియా బుధవారం(ఆగష్టు 31) హాంకాంగ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్న దృశ్యాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ట్విటర్‌లో షేర్ చేసింది.
‘‘మ్యాచ్ డే.. ఆల్ సెట్ ఫర్ హాంకాంగ్ మ్యాచ్’’ అంటూ బీసీసీఐ తాజాగా పంచుకున్న వీడియోలో విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్, దీపక్ హుడా తదితరులు బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. ఇక రిషభ్ పంత్ హెలికాప్టర్ షాట్‌తో అలరించాడు.
మరోవైపు.. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్ సహా పేసర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ సొంత జట్టు బ్యాటర్లకు బౌలింగ్ వేస్తూ కావాల్సినంత ప్రాక్టీసు చేశారు. కాగా రిషభ్ పంత్‌కు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనైనా అతడికి అవకాశం వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Match Day 💪#TeamIndia all set for #INDvHK 👊#AsiaCup2022 pic.twitter.com/hy8YkOl2pr
— BCCI (@BCCI) August 31, 2022
ఇక ఆసియా కప్-2022లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ప్రయాణం ఆరంభించిన టీమిండియా.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులతో చిరకాల ప్రత్యర్థిపై విజయ ఢంకా మోగించింది. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించి గ్రూప్- ఏ టాపర్‌గా నిలిచి.. సూపర్ 4కు అర్హత సాధించేందుకు భారత్ సమాయత్తమవుతోంది.
కాగా గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్ ఉండగా.. గ్రూప్- బిలో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్‌పై గెలుపొంది అఫ్గన్ సూపర్ 4కు చేరుకుంది.
@RishabhPant17 hitting helicopter shot in nets#INDvHK #AsiaCup2022 pic.twitter.com/VIKD6WgM3Z
— @KHABARMENIA_SPORTS (@Vikas07K) August 31, 2022
చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు!
Comments
Please login to add a commentAdd a comment