హాంకాంగ్: గత కొన్నాళ్లుగా నిరాశాజనక ప్రదర్శనతో ఆరంభం దశలోనే ని్రష్కమిస్తున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్‌లో ముందంజ వేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. ఈ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –500 టోర్నమెంట్‌లో సంచలన జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలపై అందరి దృష్టి పడింది. ఇటీవల ఈ జంట అద్భుతమైన విజయాలతో దూసుకెళుతోంది. ఇక్కడ కూడా అదే జోరు కొనసాగించేందుకు ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జోడీ సిద్ధమైంది.
మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు సింధు, సైనా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ చాంపియన్‌షి ప్ టైటిల్ తర్వాత సింధు ఆశ్చర్యకరంగా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమిస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ మినహా బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలోనూ ఒకట్రెండు రౌండ్లకే ఇంటిదారి పడుతోంది. సైనా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ టోర్నీ ద్వారా గాడిన పడాలని ఇద్దరు పట్టుదలతో ఉన్నారు.
తొలిరోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం జరిగే తొలిరౌండ్లో ఆరో సీడ్ సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్ గ ఇయున్ (కొరియా)తో; ఎనిమిదో సీడ్ సైనా... కాయ్ యాన్ యాన్ (చైనా)తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. మొదటి రౌండ్లోనే అతను ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో పోటీపడతాడు. మూడో సీడ్ షి యుకీ (చైనా)తో సాయిప్రణీత్... వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో సమీర్ వర్మ... కెంటా నిషిమోటో (జపాన్)తో కశ్యప్ తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment