![Independence Day Celebrations In Hong Kong - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/NRI.jpg.webp?itok=_rv0x-P4)
హాంకాంగ్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా, కాన్సుల్ జనరల్ మిస్ సత్వంత్ ఖనాలియా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సుర్ సాధన గ్రూప్ వారి దేశభక్తి గీతాలు, సలాంగై డ్యాన్స్ అకాడమీచే 'జై హో'పై భరతనాట్యం, శ్రీ శక్తి అకాడమీ 'భారత్' కథక్‌లు అలరించాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హాంకాంగ్ ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. దేశం పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ...ప్రధాని మోదీకి మద్దతు పలికారు.
అనంతరం 'ఆఫ్‌బీజేపీ' హాంకాంగ్, చైనా అధ్యక్షుడు సోహన్ గోయెంకా మాట్లాడుతూ 'భారత దేశ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పడమే తమ లక్ష్యమన్నారు. ఉపాధ్యక్షుడు రాజు సబ్నానీ, రమాకాంత్ అగర్వాల్, అజయ్ జకోటియా, రాజు షా, కుల్దీప్ ఎస్. బుట్టార్, సోనాలి వోరా, ఆఫ్ బీజేపీ హాంకాంగ్, చైనా ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment