ఆసియా కప్ 2022లో భాగంగా బుధవారం (ఆగస్ట్ 31) హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ వరల్డ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి కెరీర్‌లో 31వ హాఫ్‌సెంచరీ సాధించి.. రోహిత్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్‌సెంచరీల (అంతర్జాతీయ టీ20ల్లో) రికార్డును సమం చేశాడు. రోహిత్ 134 మ్యాచ్‌ల్లో 31 హాఫ్ సెంచరీలు సాధించగా.. కోహ్లి 101 మ్యాచ్‌ల్లోనే 31 హాఫ్ సెంచరీల మార్కును చేరుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన టాప్-5 ఆటగాళ్లలో కోహ్లి, రోహిత్‌ల తర్వాతి స్థానాల్లో బాబర్ ఆజామ్ (27), డేవిడ్ వార్నర్ (23), మార్టిన్ గప్తిల్ (22) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి.. రోహిత్ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేస్తే.. రోహిత్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసి ఔటైన రోహిత్ ప్రస్తుతానికి 134 మ్యాచ్‌ల్లో 3520 పరుగులు స్కోర్ చేశాడు. రోహిత్ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (3497), మూడో ప్లేస్‌లో విరాట్ కోహ్లి (3402) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ఇవాళ (ఆగస్ట్ 31) హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (44 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) నెమ్మదిగా ఆడి విసుగు తెప్పించాడు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో స్పిన్నర్ యాసిమ్ ముర్తజా (0/27), ఆయుష్ శుక్లా (1/29), మహ్మద్ గజన్ఫార్ (1/19) కాస్త పర్వాలేదనిపించారు.
చదవండి: సూర్యకుమార్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
Comments
Please login to add a commentAdd a comment