గ్రేస్​ ది రోబో​.. కరోనా పేషెంట్ల కోసమే! | Meet Grace, Spohias Sister Robot For Helps Covid 19 Patients | Sakshi
Sakshi News home page

కంటిచూపుతో కరోనా పేషెంట్లను స్కాన్​ చేసే నర్సు

Published Thu, Jun 10 2021 12:45 PM | Last Updated on Thu, Jun 10 2021 2:03 PM

Meet Grace, Spohias Sister Robot For Helps Covid 19 Patients - Sakshi

సోఫియా రోబో గుర్తుందా? ప్రపంచంలోనే అధికారిక గుర్తింపు పొందిన తొలి హ్యూమనాయిడ్ రోబో. ఈ రోబోను తయారు చేసిన కంపెనీనే ఇప్పుడు మనిషిలాంటి మరో మరమనిషిని తయారుచేసింది. దాని పేరు గ్రేస్​. కరోనా కష్టకాలంలో పేషెంట్ల బాగోగులు చూసుకోవడం కోసమే దీనిని సృష్టించడం విశేషం.

హంకాంగ్​కు చెందిన హన్​సన్​ రోబోటిక్స్​ టెక్​ సైంటిస్టుల టీం గ్రేస్​ను తయారు చేసింది. కరోనాతో ఐసోలేషన్​లో ఉన్నవాళ్ల కోసం.. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్ల బాగోగుల ఈ రోబోను రూపొందించారు. గోధుమ రంగు విగ్గు, ఏషియన్​ ముఖకవళికలతో బ్లూ నర్స్ గెటప్​తో గ్రేస్​ను ముస్తాబు చేశారు. ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో చెస్ట్​లో ఒక థెర్మల్ కెమెరా ఉంటుంది. ఇది అవతలి వాళ్ల టెంపరేచర్​ను స్కాన్​ చేసి వాళ్ల ఆరోగ్య స్థితిగతులపై ఒక అంచానకు వస్తుంది. అంతేకాదు ఆ పేషెంట్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది.



హాంకాంగ్​ హెల్త్​ కేర్ ప్రొఫెషనల్​లో గ్రేస్​ సామర్థ్యం పరిశీలించిన తర్వాతే అనుమతులు పొందగలిగామని కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్​ హన్సన్​ తెలిపాడు. మనిషి పోలికలతో ఉండే రోబోలు.. ఈ కరోనా టైంలో ఐసోలేషన్​లో ఉన్నవాళ్లతో ఇంటెరాక్ట్ అయ్యేందుకు సరైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లీష్​తో పాటు మాండరిన్​, కాంటోనీస్​ భాషల్ని ఇది మాట్లాడగలుగుతుంది. ఆసియా హెల్త్​ కేర్​ మార్కెట్​ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన గ్రేస్​ రోబోను ధరను ఇంకా నిర్ధారించలేదు. 
  
సోఫియా.. 2016లో హన్​సన్ రోబోటిక్స్​ తయారు చేసిన సూపర్ ఇంటెలిజెంట్​ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల్లాగే ప్రవర్తించడంతో పాటు జోకులు కూడా చెబుతుంది.  2017లో సోఫియాకి సౌదీ అరేబియా అక్కడి చట్టప్రకారం పౌరసత్వం ఇచ్చింది. అయినప్పటికీ సోఫియా పని తీరుపై నీలినీడలు అలుముకున్నాయి. అయితే రానున్న రోజుల్లో హ్యూమనాయిడ్స్​కు లైన్​ క్లియర్ అయ్యే అవకాశాల మీదే హన్​సన్ రోబోటిక్స్​ ఆశలు పెట్టుకుంది.

చదవండి: రోబోకి చెల్లి ఇది


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement