Grace
-
చీర.. చుడీదార్.. ఏదైనా సరే సుమ గ్రేస్ తగ్గేదే లే (ఫొటోలు)
-
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
-
గ్రేస్ ది రోబో.. కరోనా పేషెంట్ల కోసమే!
సోఫియా రోబో గుర్తుందా? ప్రపంచంలోనే అధికారిక గుర్తింపు పొందిన తొలి హ్యూమనాయిడ్ రోబో. ఈ రోబోను తయారు చేసిన కంపెనీనే ఇప్పుడు మనిషిలాంటి మరో మరమనిషిని తయారుచేసింది. దాని పేరు గ్రేస్. కరోనా కష్టకాలంలో పేషెంట్ల బాగోగులు చూసుకోవడం కోసమే దీనిని సృష్టించడం విశేషం. హంకాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ టెక్ సైంటిస్టుల టీం గ్రేస్‌ను తయారు చేసింది. కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నవాళ్ల కోసం.. ముఖ్యంగా వయసు మళ్లిన వాళ్ల బాగోగుల ఈ రోబోను రూపొందించారు. గోధుమ రంగు విగ్గు, ఏషియన్ ముఖకవళికలతో బ్లూ నర్స్ గెటప్‌తో గ్రేస్‌ను ముస్తాబు చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో చెస్ట్‌లో ఒక థెర్మల్ కెమెరా ఉంటుంది. ఇది అవతలి వాళ్ల టెంపరేచర్‌ను స్కాన్ చేసి వాళ్ల ఆరోగ్య స్థితిగతులపై ఒక అంచానకు వస్తుంది. అంతేకాదు ఆ పేషెంట్లకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. హాంకాంగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌లో గ్రేస్ సామర్థ్యం పరిశీలించిన తర్వాతే అనుమతులు పొందగలిగామని కంపెనీ వ్యవస్థాపకుడు డేవిడ్ హన్సన్ తెలిపాడు. మనిషి పోలికలతో ఉండే రోబోలు.. ఈ కరోనా టైంలో ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లతో ఇంటెరాక్ట్ అయ్యేందుకు సరైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్, కాంటోనీస్ భాషల్ని ఇది మాట్లాడగలుగుతుంది. ఆసియా హెల్త్ కేర్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన గ్రేస్ రోబోను ధరను ఇంకా నిర్ధారించలేదు. సోఫియా.. 2016లో హన్సన్ రోబోటిక్స్ తయారు చేసిన సూపర్ ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ రోబో. ఇది మనుషుల్లాగే ప్రవర్తించడంతో పాటు జోకులు కూడా చెబుతుంది. 2017లో సోఫియాకి సౌదీ అరేబియా అక్కడి చట్టప్రకారం పౌరసత్వం ఇచ్చింది. అయినప్పటికీ సోఫియా పని తీరుపై నీలినీడలు అలుముకున్నాయి. అయితే రానున్న రోజుల్లో హ్యూమనాయిడ్స్కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాల మీదే హన్సన్ రోబోటిక్స్ ఆశలు పెట్టుకుంది. చదవండి: రోబోకి చెల్లి ఇది -
ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా!
సాధారణంగా చాలామంది తాము అనుకున్న పని జరగకపోయినా, కోరిన కోరిక తీరకపోయినా, ఆశించినది అందకపోయినా ‘ఆ భగవంతుడేమిటండీ!’ అంటాం. కానీ ఓ పని జరిగిందంటే ఆ పని జరగడం వెనుక ఒకడున్నాడని గుర్తు. ‘నీవు’ అనే వాడివి ఒకడుంటేనే ’బాగున్నావా?’ అని అడుగుతారు. బాగుండడం అనేది దేనిమీద ఆధారపడింది? ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం మీద. తీసిన ఊపిరి వదలకపోతే.. వదిలిన ఊపిరి తీయకపోతే శివం, శవం అవుతుంది. మరి ఊపిరి తీసిన వాడెవరు. నీవే. మరి పోయిన వాళ్ళందరూ ఊపిరి తీయడం చేతగాకనో, మర్చిపోయో వెళ్ళిపోయారా! ఊపిరి తీసి వదిలిపెడుతున్నంత కాలం నాన్నగారు, గురువుగారు, మామయ్యగారు, అన్నయ్యగారు... అబ్బో ఎన్ని అనుబంధాలో... ఆ వాయువు తీయడం ఆగిపోయింది. చివరికి భార్య, పిల్లలు, బంధువులు కూడా ‘ఆయన శరీరం కట్టె, దాన్నెలా పట్టుకుంటాను’ అంటారు. అంటే నీ శుభాలన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని. దాన్ని పని చేయించేవాడు వేరొకడున్నాడు. నీవు నిద్రపోతున్నా దాన్ని సజావుగా పనిచేయిస్తున్నాడు కదా... వాడున్నాడని నమ్మడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి మనకి? అందుకే అన్నారు పెద్దలు శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించమని... మనం కనీసం ఈ మాత్రం ఉంటున్నామన్నా, పొద్దున్నే లేచి కాఫీనో, టీనో తాగుతూ పేపరు చదువుతూ భార్యాపిల్లలతో కబుర్లు చెప్పుకుంటున్నామన్నా కూడా అందుకు భగవంతుడి అనుగ్రహం ఉందని గ్రహించాలి. -
గ్రహం అనుగ్రహం
శ్రీజయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం తిథి బ.సప్తమి రా.10.14 వరకు నక్షత్రం హస్త రా.1.06 వరకు వర్జ్యం ఉ.8.09 నుంచి 9.52 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.20 వరకు తదుపరి ప.2.43 నుంచి 3.33 వరకు అమృతఘడియలు రా.6.34నుంచి 8.19 వరకు సూర్యోదయం: 6.37 సూర్యాస్తమయం: 5.39 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు -
దిమ్మదిరిగే గుమ్మడి..!
ఇక్కడున్నది ఆషామాషీ గుమ్మడికాదండోయ్. కాయ కాసిన 100 రోజుల్లోనే 725కిలోల బరువు పెరిగిన భారీ గుమ్మడి ఇది. అమెరికా నార్త్ డకోటా రాష్ట్రంలోని మినాట్ నగరంలో దీనిని పండిస్తున్నారు. అసాధారణ పెరుగుదల చూసి దీని యజమానులు గుమ్మడికి ‘గ్రేస్’ అని పేరుపెట్టారు. అక్టోబర్1న దీనిని కోసి ప్రదర్శనకు ఉంచుతామని ఫొటోలోని గుమ్మడి యజమానులు ప్రకటించారు.