దిమ్మదిరిగే గుమ్మడి..!
ఇక్కడున్నది ఆషామాషీ గుమ్మడికాదండోయ్. కాయ కాసిన 100 రోజుల్లోనే 725కిలోల బరువు పెరిగిన భారీ గుమ్మడి ఇది. అమెరికా నార్త్ డకోటా రాష్ట్రంలోని మినాట్ నగరంలో దీనిని పండిస్తున్నారు. అసాధారణ పెరుగుదల చూసి దీని యజమానులు గుమ్మడికి ‘గ్రేస్’ అని పేరుపెట్టారు. అక్టోబర్1న దీనిని కోసి ప్రదర్శనకు ఉంచుతామని ఫొటోలోని గుమ్మడి యజమానులు ప్రకటించారు.