అర్థరాత్రి నడిరోడ్డుపై కొడవళ్లతో విధ్వంసం ... వీడియో వైరల్‌ | Viral Video: Machete Gang As They Exit Lexus Start Attack | Sakshi
Sakshi News home page

viral Video: అర్థరాత్రి నడిరోడ్డుపై కొడవళ్లతో దాడి ... వీడియో వైరల్‌

Published Fri, Jun 10 2022 7:42 PM | Last Updated on Fri, Jun 10 2022 7:46 PM

Viral Video: Machete Gang As They Exit Lexus Start Attack  - Sakshi

కొంతమంది మద్యం తాగితే ఆ మత్తులో వారి చేసే హంగామా మామాలుగా ఉండదు. ఒక్కోసారి బార్‌ లేదా పబ్‌ల వద్ద ఫుల్‌గా తాగి ఏదో చిన్న చిన్న విషయాలకే ఇగోకి వెళ్లి ఆ మత్తులోనే ఘోరమైన అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక గ్రూప్‌ బార్‌లో జరిగిన చిన్న వివాదాన్ని సీరియస్‌ తీసుకుని అర్థరాత్రి అని కూడా లేకుండా వెంటపడి మరీ దాడి చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ ఘటన హంకాంగ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...హాంకాంగ్‌లో లాన్ క్వాయ్ ఫాంగ్ ప్రాంతంలోని బార్‌లో రెండు గ్రూప్‌ల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఆ గ్రూప్‌లలో ఒక బృందం ఆ బార్‌ నుంచి నిష్క్రమించి వెళ్లిపోయింది. ఐతే మరో గ్రూప్‌ ఆ వివాదాన్ని కాస్త సీరియస్ తీసుకుని వారి పై దాడి చేసేందుకై వారిని ఫాలో అవుతూ.. ఒక లగ్జరీ కారులో బయలుదేరారు. ఇంతలో ట్రాఫిక్‌ జంక్షన్‌లో కారులన్ని ఆగిపోయి ఉన్నాయి. అంతే సదరు గ్రూప్‌ తమ కారుని తమ ప్రత్యర్థి గ్రూప్‌కి సంబంధించిన తెల్ల కారు పక్కనే ఆపి మరీ.. కొడవళ్లు తీసుకుని దాడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు మొత్తం ఎనిమిది మంది నడి రోడ్డుపై కొడవళ్లతో పెద్ద బీభత్సం సృష్టించారు.

ఇంతలో వెనెక ఉన్న ఒక నలుపు వ్యాన్‌ ఆ రెండు కార్ల మధ్యలోంచి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇంతలో ఆ బృందం అకస్మాత్తుగా వెనక్కి తమ కారు వద్దకు వచ్చి ఎక్కి హడావిడిగా వెళ్లేందుకు యత్నిస్తారు. ట్వీస్ట్‌ ఏంటంటే అక్కడే సమీపంలో పోలీసులు ఉన్నారు. వెంటనే వారు స్పందించి అక్కడికక్కడే దాడిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అంతేకాదు ఆ ప్రాంతంలో కర్ఫ్యూని కూడా విధించారు. ఐతే ఈ ఘటనకు సంబంధించిని వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement