
హాంగ్‌కాంగ్: సాధారణంగా ఓ ఇంటి అద్దె వేలల్లో లేదా లక్షల్లో ఉంటుంది. కానీ దక్షిణ చైనాలో హాంగ్‌కాంగ్‌లోని ఈ ఇంటి అద్దె ఎంతో తెలిస్తే అందరూ కళ్లు తేలేయాల్సిందే. నెలకు ఈ ఇంటి అద్దె 1.26 కోట్ల రూపాయలు. ఇది వింటే ఇది అద్దెనా లేక ఇంటి ఖరీదా అని అందరికి డౌట్ రావోచ్చు. కానీ ఇది అక్షరాల అద్దె. ఎందుకంటే అదే రేంజ్‌లో ఈ ఇంటిలో స్టార్ హోటళ్లను మించిన గదులు, ఇతర సౌకర్యాలు ఉన్నాయట. చూడటానికి ప్యాలేస్‌ను తలపిస్తున్న ఈ ఇళ్లు మొత్తం 10, 804 అడుగుల విస్తిర్ణంలో... విలాసవంతమైన గదులు, రకారకాల పూలతో కూడిన తోటతో నిర్మించారట.
ఇక లోపల ఓ ప్రైవేటు గ్యారేజ్, అధునాతమైన సాంకేతికతతో తయారు చేయించిన లిఫ్టులు ఉన్నాయట. ఇక ఈ భవనం నుంచి బయటకు చూస్తే విక్టోరియా హార్బర్ స్పష్టంగా కనిపిస్తుందట. అందుకే ఈ ఇంటికి హాంగ్‌కాంగ్‌లో అన్నిటికంటే అధిక రెంటు ఉన్నట్లు నైట్ ప్రాంక్ ఎల్‌ఎల్‌పీ ఎగ్జీక్యూటివ్ డైరెక్టర్ థామస్ లామ్ పేర్కొన్నారు. హాంగ్‌కాంగ్‌లో గృహల కొరత, లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తక్కువ ఉండటం వల్ల అక్కడి శ్రీమంతులు ఈ ఇంట్లో రెంటుకు ఉండేందుకు ముందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
చదవండి: ఇంటర్వ్యూలలో ఫెయిల్.. బాధతో 9 ప్లాస్టిక్ సర్జరీలు
చైతు కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత
Comments
Please login to add a commentAdd a comment