
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట కొనసాగుతోంది. రెజ్లర్ వినేష్ ఫోగట్ తన జైత్రయాత్రను జకర్తాలోను కొనసాగించారు. రెజ్లింగ్ విభాగంలో ఫోగట్ భారత్‌కు మరో స్వర్ణాన్నిఅందించారు. సోమవారం మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్‌లో ఫోగట్.. జపాన్ రెజ్లర్ యుకీ ఐరీపై 6-2తేడాతో చిత్తుచేసి స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నారు. తొలి నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఫోగట్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా వినేష్ ఫోగట్ సరికొత్త రికార్డు సృష్టించారు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం, రెండు రజత పతకాలు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment