కీవ్(ఉక్రెయిన్): అవుట్‌స్టాండింగ్ ఉక్రెనియన్ రెజ్లర్స్ అండ్ కోచెస్ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆదివారం 53 కిలోల విభాగం ఫైనల్లో రెండుసార్లు యూరోపియన్ చాంపియన్ అయిన వనేసా కలాద్‌జిన్‌స్కాయ్ (బెలారస్) 10-8 తేడాతో ఓడించి స్వర్ణం సాధించింది.
అంతకముందు శనివారం జరిగిన 53 కేజీల విభాగం సెమీఫైనల్లో వినేశ్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆండ్రియా అనా (రొమేనియా)ను ఓడించిన సంగతి తెలిసిందే. కాగా తొలి రౌండ్‌లో వినేశ్ 3–1తో అక్‌తెంగె కెయునిమ్‌జయెవా (ఉజ్బెకిస్తాన్)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–1తో పిచ్‌కౌస్కాయ (బెలారస్)పై... క్వార్టర్ ఫైనల్లో 2–0తో లియోర్డా (మాల్డొవా)పై గెలిచింది.
Vinesh Phogat 🥇
— Vinay Siwach (@siwachvinay) February 28, 2021
So much self belief in that bout from Vinesh. Once her inside trip didn’t work, she defends the attack and completes her own to win the gold with a fall pic.twitter.com/eXIIE8D9vp
Comments
Please login to add a commentAdd a comment