
వినేష్ పోగత్. రెజ్లింగ్‌లో కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్ రెండింట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న ఒకే ఒక్క రెజ్లర్. వినేష్ పెదనాన్న పేరున్న రెజ్లర్ మహవీర్ సింగ్ పోగత్. ఆయన తన నలుగురు కూతుళ్లతో పాటు తన తమ్ముడి కూతుళ్లయిన ప్రియాంక, వినేష్‌లకూ కలిపి ఇంట్లోనే రెజ్లింగ్‌లో తిరుగులేని ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన కథను ‘దంగల్’ పేరుతో బాలీవుడ్ సినిమాగా కూడా తీసింది. ఇప్పుడు ఈ ఆరుగురూ పెద్ద రెజ్లర్స్. గీతా, బబితా, వినేష్ ఇప్పటికే కామన్‌వెల్త్‌లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే, వీళ్లలో వినేష్ తాజాగా ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ సాధించారు.
ఇది ఇండియన్ వుమన్ రెజ్లింగ్ చరిత్రలోనే రికార్డు. ఈ అవార్డు అందుకున్న వినేష్, తన ఆనందాన్ని తెలుపుతూ, ‘ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ అందుకోవడం అద్భుతంగా ఉంది. ఈ మెడల్ ఇండియాది. అన్ని సందర్భాల్లో నా వెన్నంటి ఉన్న వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇది ప్రారంభం మాత్రమే. ఏ సక్సెస్‌తోనూ ఎప్పుడూ ఆగిపోవద్దు. నెవర్ స్టాప్.’ అంటున్నారు వినేష్!
Comments
Please login to add a commentAdd a comment