ఎయిర్‌పోర్ట్‌లో స్టార్‌ప్లేయర్‌ ఎంగేజ్‌మెంట్‌ | Vinesh Phogat Gets Engaged At Delhi Airport After Gold Win | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 28 2018 3:46 PM | Last Updated on Tue, Aug 28 2018 3:48 PM

Vinesh Phogat Gets Engaged At Delhi Airport After Gold Win - Sakshi

వినేశ్‌ ఫొగాట్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఏషియన్‌గేమ్స్‌లో సత్తా చాటి భారత్‌కు స్వర్ణం అందించిన స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తన ఎంగేజ్‌మెంట్‌ను వినూత్నంగా జరుపుకున్నారు. రెజ్లింగ్‌లో పసిడి కొట్టి తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం జకార్త నుంచి భారత్‌కు తిరుగు వచ్చే క్రమంలో ఆమె ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన వివాహ నిశ్చితార్థం జరుపుకున్నారు. తన ప్రియుడు సోమ్‌వీర్‌ రతితో ఇరుకుటుంబాల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది.

గ్రీకో-రోమన్‌ రెజ్లర్‌ అయిన సోమ్‌వీర్‌తో వినేశ్‌ ఎయిర్‌పోర్ట్‌లోనే రింగ్స్‌ మార్చుకుని కేకు కట్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మహిళల ఫ్రీస్టయిల్‌ 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వినేశ్‌ ఫొగాట్‌.. ఫైనల్లో జపాన్‌ రెజ్లర్‌ యుకి ఇరీని 6-2తో ఓడించారు. ఇక తన లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సేనని, దీని కోసం అన్ని పోటీల్లో పాల్గొంటున్నాని వినేశ్‌ ఫొగాట్‌ స్పష్టం చేశారు.(చదవండి: ‘పసిడి’  కాంత)

The best decision I ever made! Glad you pinned me for life 😍❤️

A post shared by Vinesh Phogat (@vineshphogat) on

ప్రియుడు సోమ్‌వీర్‌తో వినేశ్‌ ఫొగాట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement