నీరజ్ చోప్రా
జకార్త: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ అదరగొట్టారు. సోమవారం అథ్లెటిక్స్ విభాగంలో పతకాల పంట పండించారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. 88.06 స్కోర్ సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 83.46 స్కోర్ సాధించిన నీరజ్.. రెండో ప్రయత్నంలో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంలో రికార్డు 88.06 స్కోరు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అనంతరం మరో మూడుసార్లు ప్రయత్నించినప్పటికి ఈ స్కోర్‌ను అధిగమించలేకపోయాడు. 82.22 స్కోర్‌తో చైనా ఆటగాడు లియూ కిజెన్ రజతం సొంతం చేసుకోగా..80.75 స్కోర్‌తో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ అర్షబ్ కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్ సింగ్ శివపాల్ (74.11)తో 8వ స్థానంలో నిలిచాడు.
ఇక పురుషుల హర్డల్స్ విభాగంలో అయ్యసామి ధరుణ్ రజతం సొంతం చేసుకోగా.. మహిళల లాంగ్‌జంప్ విభాగంలో వరాకిల్ నీనా (6.51)తో రజతం కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత క్రీడాకారిణి నాయన జేమ్స్(6.14)తో పదోస్థానంలో నిలిచింది. పురుషుల హై జంప్‌లో బాలసబ్రమణ్యన్ చేతన్ పోరాటం ముగిసింది. ఫైనల్లో అతను 8 స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్ విభాగంలో సుధా సింగ్ రజతం కైవసం చేసుకుంది. ఫైనల్లో 9 నిమిషాల 40 సెకన్లలో గమ్యం చేరుకొని రెండోస్థానంలో నిలిచింది. ఇక ఫైనల్‌కు అర్హత సాధించిన మరో భారత క్రీడాకారిణి చింతా (10 నిమిషా 26 సెకన్లతో) 11వ స్థానంతో సరిపెట్టుకుంది. పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత అథ్లెట్ స్వామి శంకర్ లాల్ 8వ స్థానంలో నిలిచాడు. దీంతో ఇప్పటి వరకు భారత పతకాల సంఖ్య 8 స్వర్ణాల, 13 రజతాలు, 20 కాంస్యాలతో 41కి చేరింది. పతకాల జాబితో భారత్ 9 స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment