టుర్కు (ఫిన్‌లాండ్): ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడో పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.
నీరజ్ జావెలిన్‌ను 85.97 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. టోనీ కెరనెన్ (ఫిన్‌లాండ్; 84.19 మీటర్లు) రజతం నెగ్గగా... ఒలివెర్ హెలాండర్ (ఫిన్‌లాండ్; 83.96 మీటర్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.
రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా; 82.58 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది నీరజ్ దోహా డైమండ్ లీగ్ మీట్‌లో రెండో స్థానాన్ని పొందగా... భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్ మీట్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment