వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. విభిన్న అంశాలపై ‘ఎక్స్’లో (ట్విటర్) ద్వారా తన స్పందనను పంచుకుంటుంటారు. భిన్న అంశాలలో ప్రతిభావంతులను, క్రీడాకారులను ప్రశంసిస్తుంటారు. తాజాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత నీరజ్ చోప్రా పట్ల స్పందించారు.
నీరజ్ రెండో బంగారు పతకానికి దూరమైనప్పటికీ, అతని అద్భుతమైన ప్రదర్శన, తిరుగులేని నిలకడను ఆనంద్ ప్రశంసించారు. అలాగే స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రికార్డ్-బ్రేకింగ్ విజయాన్నీ అభినందించారు. నీరజ్‌తో అతని క్రీడాస్ఫూర్తిని, స్నేహాన్ని మెచ్చుకున్నారు.
"నేను ఒప్పుకుంటున్నాను. నిన్న రాత్రి నీరజ్ చోప్రాకు రెండో ఒలింపిక్ బంగారు పతకం చేజారిన వేళ నిశ్చేష్టుడనయ్యాను. కానీ, ఈ ఉదయం ముందుగా రికార్డ్ బద్దలు కొట్టిన అర్షద్ నదీమ్‌ని, నీరజ్‌తో అతని క్రీడాస్ఫూర్తి, స్నేహాన్ని అభినందించాలనుకుంటున్నాను. ఇక అత్యంత నిలకడను ప్రదర్శించిన నీరజ్ కూడా గోల్డ్ గెలిచినట్టేనని నేను చెప్పాలనుకుంటున్నాను. నీరజ్ భారత్‌కు మొదటి రజత పతకాన్ని అందించారు. నీరజ్ మీరు నిజంగా గొప్ప అథ్లెట్, మంచి మనిషి. మా అందరినీ గర్వపడేలా చేశారు" అని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
I confess.
I was devastated last night when @Neeraj_chopra1 didn’t win his second Olympic gold medal.
But, this morning, I first want to congratulate Arshad Nadeem for his record-breaking throw.
AND his sportsmanship & camaraderie with Neeraj.
Then I want to tell Neeraj… pic.twitter.com/4KjPPrDh2e— anand mahindra (@anandmahindra) August 9, 2024
Comments
Please login to add a commentAdd a comment