జకార్తా: ఆసియా క్రీడల స్క్వాష్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టుకు స్వర‍్ణ పతక పోరులో నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన మహిళల ఫైనల్ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్ చేతిలో ఓటమి పాలైంది. ఫలితంగా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దీపికా పళ్లికల్, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా బృందం ఆఖరి పోరులో పరాజయం చెందారు. దాంతో స్వ్కాష్‌లో తొలిసారి స్వర‍్ణం అందుకునే అవకాశాన్ని భారత మహిళా జట్టు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ పతకాల సంఖ్య 68 కాగా, అందులో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 29 కాంస్య పతకాలున్నాయి.
ఈ రోజు జరిగిన బాక్సింగ్ పోరులో భారత్ పసిడి సాధించింది. పురుషుల లైట్ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంగాల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత దుస్మాతోవ్ హసన్‌బాయ్(ఉజ్బెకిస్తాన్)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఆది నుంచి ప్రత్యర్థిపై తన పదునైన పంచ్‌లతో విరుచుకుపడిన అమిత్.. హసన్‌బాయ్‌పై పైచేయి సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. ఇక బ‍్రిడ్జ్ ఈవెంట్‌లో సైతం భారత్ స్వర్ణం సాధించింది. మెన్స్ పెయిర్ ఫైనల్-2లో భారత్ జోడి ప్రణబ్ బర్దాన్- శివ్‌నాథ్ సర్కార్‌లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment