సింధూను వదలని ఫైనల్ ఫోబియా | Asian Games 2018: PV Sindhu Loses In Final | Sakshi
Sakshi News home page

సింధూను వదలని ఫైనల్ ఫోబియా

Published Tue, Aug 28 2018 1:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్‌ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్‌ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి  తై జు యింగ్(చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. ఫలితంగా సింధు రజతంతోనే సంతృప్తి పడింది.

వరుస రెండు గేమ్‌లను తై జు యింగ్‌కు సునాయాసంగా కోల్పోయిన సింధు.. మరొకసారి ఫైనల్‌ ఫోబియాను అధిగమించలేకపోయింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లయ్యింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement