
ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు) విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో ఫౌద్ మీర్జా... టీమ్ విభాగంలో ఫౌద్ మీర్జా, రాకేశ్, ఆశిష్, జితేందర్ సింగ్‌లతో కూడిన జట్టు రెండో స్థానంలో నిలిచింది. 1982 ఆసియా క్రీడల్లో రఘువీర్ సింగ్ తర్వాత 36 ఏళ్లలో వ్యక్తిగత విభాగంలో భారత్ తరఫున పతకం నెగ్గిన ప్లేయర్‌గా ఫౌద్ మీర్జా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన ఈవెంట్‌లో మీర్జా 26.40 జంపింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. యొషియాకి (జపాన్–22.70 పాయింట్లు) స్వర్ణం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment