రేసుగుర్రం ‘మన్ని’తో ఏడేళ్ల బంధానికి తెర
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో ఈక్వె్రస్టియన్ చాంపియన్ అనూశ్ అగర్‌వల్లా తనకు అచ్చొచ్చిన రేసుగుర్రానికి గుడ్‌బై చెప్పాడు. ‘మన్ని’ అని ముద్దుగా పిలుచుకునే గుర్రంతో ఏడేళ్ల బంధానికి భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. 2023లో హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో అనూశ్ పాలిట ‘మన్ని’ బంగారు గుర్రం అయ్యింది.
ఈక్వె్రస్టియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్‌లో మన్నిపై స్వారీ చేసిన అనూశ్ స్వర్ణ పతకం సాధించాడు. ‘మన్ని’కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిoదని, ఇకపై ఆ రేసుగుర్రంతో బరిలోకి దిగబోనని సోషల్ మీడియాలో ప్రకటించాడు.
‘నా తొలి అడుగులన్నీ మన్నితోనే వేశా. తొలి గ్రాండ్‌ప్రి, మొదటి అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి, అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానం... ఇలా చెప్పుకుంటూపోతే... పెద్ద పెద్ద అంతర్జాతీయ టోర్నీల్లో నా పోటీ ప్రదర్శనలకు రేసుగుర్రం నేను కన్న కలల్ని సాకారం చేసింది.
అన్నింటికి మించి ఓ గుర్రం, రైడర్ ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తన వేగంతో చాటి చెప్పింది’ అని భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment