race horses
-
‘బంగారు’ గుర్రానికి అనూశ్ బైబై
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో ఈక్వె్రస్టియన్ చాంపియన్ అనూశ్ అగర్వల్లా తనకు అచ్చొచ్చిన రేసుగుర్రానికి గుడ్‌బై చెప్పాడు. ‘మన్ని’ అని ముద్దుగా పిలుచుకునే గుర్రంతో ఏడేళ్ల బంధానికి భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. 2023లో హాంగ్జౌ (చైనా)లో జరిగిన ఆసియా క్రీడల్లో అనూశ్ పాలిట ‘మన్ని’ బంగారు గుర్రం అయ్యింది.ఈక్వె్రస్టియన్ (గుర్రపుస్వారీ) ఈవెంట్లో మన్నిపై స్వారీ చేసిన అనూశ్ స్వర్ణ పతకం సాధించాడు. ‘మన్ని’కి రిటైర్మెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చిoదని, ఇకపై ఆ రేసుగుర్రంతో బరిలోకి దిగబోనని సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘నా తొలి అడుగులన్నీ మన్నితోనే వేశా. తొలి గ్రాండ్‌ప్రి, మొదటి అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి, అంతర్జాతీయ పోటీల్లో ప్రథమ స్థానం... ఇలా చెప్పుకుంటూపోతే... పెద్ద పెద్ద అంతర్జాతీయ టోర్నీల్లో నా పోటీ ప్రదర్శనలకు రేసుగుర్రం నేను కన్న కలల్ని సాకారం చేసింది. అన్నింటికి మించి ఓ గుర్రం, రైడర్ ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తన వేగంతో చాటి చెప్పింది’ అని భావోద్వేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ చేశాడు. -
ఈ షేర్లు- రేస్ గుర్రాలు
ముంబై, సాక్షి: ఓవైపు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ చేస్తుంటే.. మరోవైపు సానుకూల వార్తల నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. వెరసి నేటి ట్రేడింగ్‌లో కొన్ని కంపెనీల షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి. జాబితాలో అల్ట్రాటెక్, గుడ్ఇయర్ ఇండియా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. మార్కెట్ క్యాప్ సిమెంట్ రంగ దిగ్గజం అల్ట్రాటెక్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 5.211 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 5,237 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 1.5 లక్షల కోట్లను తాకడం విశేషం. ఇటీవల 12.8 ఎంటీపీఏ ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించింది. ఇందుకు రూ. 5,477 కోట్లు వెచ్చించనుంది. దీంతో కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం 136.25 ఎంటీపీఏకు చేరనుంది. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు 4 శాతం లాభపడి రూ. 1,255 వద్ద ముగిసింది. తొలుత రూ. 1262 వద్ద లైఫ్‌టైమ్ గరిష్టానికి చేరింది. 18 ఎకరాలలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. చదవండి: (పసిడి, వెండి- 2 వారాల గరిష్టం) డీమార్ట్ జోరు వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించడంతో గుడ్ఇయర్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లింది. రూ. 1,179 సమీపంలో సరికొత్త గరిష్టాన్ని చేరింది. చివరికి 16 శాతం లాభపడి రూ. 1,157 వద్ద ముగిసింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 17 రికార్డ్‌డేట్‌గా పేర్కొంది. గత 7 రోజుల్లో ఈ షేరు 41 శాతం పెరిగింది! ఇక డీమార్ట్ స్టోర్ల కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 6 శాతం బలపడి రూ. 2,678 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 2,689 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. గత 6 రోజుల్లో ఈ షేరు 16 శాతం ర్యాలీ చేసింది. కోవిడ్-19 లాక్‌డవున్‌ల తదుపరి తిరిగి బిజినెస్ జోరందుకోవడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
ఆకలితో... అలమటించిన రేసుగుర్రాలు
పాపం ఇక్కడ దీనంగా కళ్లు వాల్చుకొని నిలబడ్డ గుర్రం నెలరోజులపాటు ఆహారం లేకుండా బతికింది. ఈ ఒక్క గుర్రమే కాదు 49 రేసు గుర్రాలు తిండి లేకుండా నెలరోజులు ఆకలితో అలమటించాయి. ఇదెక్కడి దారుణం అంటారా! ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోని దోబా అనే గుర్రపుశాలలో ఎవరో వీటిని బంధించారు. గుర్రపుశాల ఊరికి దూరంగా ఉండడంతో ఎవరూ గమనించలేకపోయారు. చివరికి ఎవరో విషయం తెలుసుకుని దగ్గర్లోని ఫ్రెండీకోస్ అనే స్వచ్ఛంద సంస్థకు కబురు పంపారు. వారంతా వచ్చిచూస్తే...ఆకలికి సొమ్మసిల్లిన గుర్రాలు కొన్ని, మెడలో తాళ్లను తెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్న గుర్రాలు కొన్ని, ప్రాణాలు విడిచిన గుర్రాలు కొన్ని... అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. త్వరత్వరగా వాటి కట్లు విప్పి వాటికి మేత వేశారు. కట్లు తెంచుకోడానికి ప్రయత్నించిన గుర్రాల కాళ్లకు పుండ్లు అయి లేవలేని స్థితిలో ఉన్నవాటికి వైద్యం చేయించి సపర్యలు చేశారు. ఓ ఆరు గుర్రం పిల్లలు మాత్రం కన్నుమూశాయి. ఎంతో ఖరీదైన గుర్రాలను ఇలా ఊరవతల బంధించి వెళ్లిన వారెవరో కనుగొని కఠినంగా శిక్షించివలసిందిగా ఈ ఫ్రెండీకోస్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గురించి ఫేస్బుక్లో పెట్టడంతో ఆ గుర్రాల పోషణకు ఆర్థికసాయం చేస్తామంటూ చాలామంది ముందుకు వస్తున్నారు.