జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ ఈవెంట్‌లో భారత్ పతకాలు పంట పండిస్తోంది. ముందుగా పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్‌లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్‌లో భారత్ పసిడితో మెరిసింది. టీమ్ ఈవెంట్‌లో భారత రోయర్లు సవరణ్ సింగ్, దత్తు భోకనల్, ఓం ప‍్రకాశ్, సుఖ్‌మీత్ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు.
శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి స‍్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. మొత‍్తంగా ఇప్పటివరకూ భారత్ 21 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 5 స్వర్ణాలు, 4 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.
చదవండి: కనకం కాదు కంచు...
Comments
Please login to add a commentAdd a comment