rowing
-
క్వార్టర్స్‌లో బల్రాజ్
రోయింగ్‌లో భారత ప్లేయర్ బల్రాజ్ పన్వర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ స్కల్స్ రెపిచేజ్ రెండో రౌండ్లో ఆదివారం బల్రాజ్ రెండో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు. 7 నిమిషాల 12.41 సెకన్లలో పన్వర్ లక్ష్యాన్ని చేరాడు. క్వెంటిన్ ఆటోగ్నెల్లీ (మొనాకో; 7 నిమిషాల 10 సెకన్లలో) టాప్ ప్లేస్‌లో నిలిచాడు. రెపిచేజ్ రౌండ్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రోవర్లు మంగళవారం క్వార్టర్ఫైనల్లో తలపడనున్నారు. -
రెండు కాంస్యాలతో ముగింపు.. రోయింగ్‌లో మెరుగైన భారత్ ప్రదర్శన
హాంగ్జౌ: గత ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన భారత రోయర్లు ఈసారి ఐదు పతకాలు గెలిచి తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్నారు. సోమవారం నాలుగు ఫైనల్స్‌లో భారత క్రీడాకారులు పోటీపడగా... రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. ఆదివారం భారత రోయర్లకు రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి. సోమవారం పురుషుల ఫోర్ ఈవెంట్లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:08.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్ ఈవెంట్లో సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్, జకర్ ఖాన్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:10.81 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. నాడు తండ్రి... నేడు తనయుడు... 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఇందర్‌పాల్ సింగ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. 21 ఏళ్ల తర్వాత ఇందర్‌పాల్ సింగ్ తనయుడు పరిమందర్ సింగ్ తండ్రి ఘనతను అందుకున్నాడు. పర్మిందర్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు ఈసారి క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం గెలిచింది. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు -
Asian Games 2023: పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్
హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికి భారత్ ఖాతాలో మొత్తం ఐదు పతకాలు చేరాయి. ఇందులో 3 సిల్వర్ (2 రోయింగ్, ఒకటి షూటింగ్), 2 బ్రాంజ్ మెడల్స్ (షూటింగ్లో ఒకటి, రోయింగ్‌లో ఒకటి) ఉన్నాయి. మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో అషి చౌక్సీ, మేహుల్ ఘోష్, రమిత త్రయం రజత పతకం సాధించగా.. ఫురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ రోయింగ్‌లో భారత జోడీ అర్జున్ లాల్ ఝట్, అరవింద్ సింగ్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. రోయింగ్ మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబు లాల్ యాదవ్, లేఖ్ రామ్ జోడీ కాంస్య పతకం సాధించగా.. రోయింగ్ మెన్స్ 8 ఈవెంట్లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మహిళల షూటింగ్ 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత స్టార్ షూటర్ రమిత కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ ఐదు పతకాలతో ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 10 పతకాలతో (9 స్వర్ణాలు, ఓ రజతం) చైనా అగ్రస్థానంలో కొనసాగుతుంది. కాగా, ఈసారి ఏషియన్ గేమ్స్‌లో భారత్ 655 సభ్యుల బృందంతో బరిలోకి దిగింది. క్రితం సారి (2018, జకార్తా) క్రీడల్లో భారత్ 570 సభ్యుల బృందంతో బరిలోకి దిగి 70 మెడల్స్ (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) సాధించింది. 2023 ఆసియా క్రీడలు నిన్నటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
మృత్యువుతో పందెం వేసుకోవడమే!
అట్లాంటిక్ సముద్రంలో ఆ రూటు అత్యంత ప్రమాదకరమైనది. జలాలు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసి పడుతుంటాయి. తుపాన్లు తరచుగా వస్తుంటాయి. పెద్ద పెద్ద సొరచేపలు ఆవురావురుమంటూ నరమాంసం కోసం తిరుగుతూ ఉంటాయి. చిన్న మర పడవలను కూడా బోల్తా కొట్టేంచే శక్తి వాటి సొంతం. ఆకాశాన చుక్కలు కూడా లేని చిమ్మ చీకటిలో అణు క్షణం ఈ ప్రమాదాలు ఎదుర్కొవాలి. అదే రూటులో తరచుగా వచ్చే పెద్ద సరకు రవాణా ఓడల బారిన పడకుండా తప్పించుకోవాలి. మర పడవ కాకుండా రోయింగ్ పడవలో ప్రయాణం చేయడమంటే సాహసం చేయడం కాదు, ప్రాణాలను పణంగా పెట్టడం. తెడ్ల వేసుకుంటూ మూడువేల మైళ్లు ప్రయాణించడమంటే మృత్యువుతో పందెం వేసుకోవడమే! అలా ముగ్గురు సోదరులు ఎవాన్ 27, జమీ 26, లచ్లాన్ 21 కలిసి డిసెంబర్ 12వ తేదీన ఈ సాహసానికి ఒడిగట్టారు. దాదాపు ఐదు లక్షల రూపాయలు విలువైన 28 అడుగుల రోయింగ్ (తెడ్లతో నడిపే) పడవలో అట్లాంటిక్ సముద్రంలో కానరీ దీవుల్లోని లా గొమెరా నుంచి మూడు వేల మైళ్ల దూరంలోని కరీబియన్‌లోని ఆంటిగ్వా నెల్సన్స్ హార్బర్‌కు గురువారం చేరుకున్నారు. ఇందుకు వారికి సరిగ్గా 35 రోజుల, తొమ్మిది గంటల, తొమ్మిది నిమిషాలు పట్టింది. ముగ్గురు సోదరులకు ప్రయాణంలో ‘సీ సిక్నెస్’ వచ్చింది. ఒంటి నిండా కురుపులు, దద్దులు లేచాయి. వాటికి ఎప్పటికప్పుడు యాంటీ బయాటిక్స్ పూసుకుంటూ, నిద్రలేమి రాత్రులు గడుపుతూ వారు ఈ సాహసాన్ని పూర్తి చేశారు. ఏ సాహసం చేయాలన్నా అందుకు ఓ లక్ష్యం ఉండాలి. అందుకని ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూనే ప్రపంచంలో దారిద్య్రాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ‘ఫీడ్‌బ్యాక్ మడగాస్కర్’తో పాటు ‘చిల్డ్రన్ ఫస్ట్’ చారిటీ సంస్థకు రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆర్జించేందుకు వారు కొత్త ప్రపంచ రికార్డును సష్టించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ కూడా ఇలాంటి సాహసానికి ఒడిగట్టలేదట. స్వతహాగా అన్నదమ్ములం అవడం వల్ల ఆ అనుబంధం, పరస్పర స్ఫూర్తితో ఈ విజయాన్ని సాధించామని, ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని వారు తమదైన శైలిలో చెప్పారు. -
పతకాలు నెగ్గిన వారందరూ సైనికులే
కదనరంగంలోనే కాదు దేశం కోసం క్రీడాంగణంలోనూ తమ సత్తా చాటుతామని భారత సైనికులు నిరూపించారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు మన క్రీడాకారులు స్వర్ణం, రెండు కాంస్యాలతో తమ పోరాటానికి చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. గురువారం నాలుగు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరినా ఒక్క పతకం కూడా గెలవలేకపోయిన బాధను మరచి... శుక్రవారం వీరోచిత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్‌లో పసిడి పతకం దక్కించుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్‌లతో కూడిన జోడీ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం... దుష్యంత్ చౌహాన్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో కాంస్యం సాధించాడు. రోయింగ్తోపాటు టెన్నిస్, షూటింగ్‌లోనూ రాణించి పోటీల ఆరో రోజును భారత్ రెండు స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలతో ముగించింది. పాలెంబాంగ్: ఒకరోజు ముందు పతకాలు గెలవాల్సిన చోట తడబడ్డామనే బాధ ఒకవైపు వేటాడుతుండగా... దేశానికి పతకాలతో తిరిగి వెళ్లాలనే చివరి అవకాశం కళ్ల ముందు కదలాడుతుండగా... భారత రోయర్లు అద్భుతం చేశారు. తమ శక్తినంతా కూడదీసుకొని స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి మూడు పతకాలతో స్వదేశానికి సగర్వంగా తిరిగి రానున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు శుక్రవారం భారత్ మూడు పతకాలతో మెరిపించింది. ముందుగా లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకంతో ఖాతా తెరిచాడు. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని దుష్యంత్ 7 నిమిషాల 18.76 సెకన్లలో చేరి మూడో స్థానాన్ని పొందాడు. హ్యున్సు పార్క్ (కొరియా; 7ని:12.86 సెకన్లు) స్వర్ణం... చున్ చియు హిన్ (హాంకాంగ్; 7ని:14.16 సెకన్లు) రజతం గెలిచారు. 2014 ఇంచియోన్ క్రీడల్లోనూ ఇదే విభాగంలో దుష్యంత్‌కు కాంస్యం లభించింది. కాంస్యంతో ఖాతా తెరిచిన ఉత్సాహంతో క్వాడ్రాపుల్ స్కల్స్ ఫైనల్ రేసుకు సిద్ధమైన భారత బృందం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం 6 నిమిషాల 17.13 సెకన్లలో అందరికంటే ముందుగా చేరుకొని పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్ స్కల్స్‌లో కాంస్యం నెగ్గిన సవర్ణ్ ఆ తర్వాత గాయంతో దూరమయ్యాడు. గతేడాది పునరాగమనం చేసిన అతను ఈసారి స్వర్ణాన్ని మెడలో వేసుకున్నాడు. ‘నేను పునరాగమనం చేస్తానని...దేశం కోసం మళ్లీ పతకం గెలుస్తానని అస్సలు అనుకోలేదు. నా వెన్నునొప్పి చికిత్సకు భారత రోయింగ్ సమాఖ్య ఖర్చులు భరించింది. మళ్లీ బరిలో దిగేందుకు చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ కూడా ఎంతో ప్రోత్సహించారు’ అని సవర్ణ్ సింగ్ అన్నాడు. కాంస్యం, స్వర్ణం లభించాక లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్‌లతో కూడిన జోడీ భారత్ ఖాతాలో మూడో పతకాన్ని జమచేసింది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని భగవాన్, రోహిత్ ద్వయం 7 నిమిషాల 04.61 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. సంయుక్త డుంగ్‌డుంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామిని సింగ్‌లతో కూడిన భారత బృందం ఉమెన్స్ ఫోర్ ఫైనల్లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచింది. రోయింగ్ కోచ్‌పై వేటు? ఏషియాడ్ రోయింగ్‌లో పతకాల లక్ష్య సాధనలో విఫలమైనందుకు విదేశీ కోచ్ నికోలాయ్ జియోగాపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. భారత బృందం ప్రదర్శనపై రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గిరీష్ ఫడ్నిస్... త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా రొమేనియాకు చెందిన జియోగా... శిక్షణపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అతడి పద్ధతుల కారణంగా భారత రోయర్లు అస్వస్థతకు గురవడంతో పతకాల సాధనలో వెనుకడినట్లు సమాఖ్య అధికారులు భావిస్తున్నారు. దీంతో జియోగాను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ►ఆసియా క్రీడల చరిత్రలో రోయింగ్‌లో భారత్‌కు లభించిన స్వర్ణాల సంఖ్య. 2010లో బజరంగ్ లాల్ ఠక్కర్ సింగిల్ స్కల్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించాడు. ►ఢిల్లీ ఏషియాడ్ (1982)లో రోయింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించారు. -
రోయింగ్‌లో భారత్‌కు పసిడి
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ ఈవెంట్లో భారత్ పతకాలు పంట పండిస్తోంది. ముందుగా పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై డబుల్ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్ ఈవెంట్లో భారత్ పసిడితో మెరిసింది. టీమ్ ఈవెంట్లో భారత రోయర్లు సవరణ్ సింగ్, దత్తు భోకనల్, ఓం ప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి స్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. మొత్తంగా ఇప్పటివరకూ భారత్ 21 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో 5 స్వర్ణాలు, 4 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి. చదవండి: కనకం కాదు కంచు... 15 ఏళ్లకే పతకం కొట్టాడు -
ఏషియన్ గేమ్స్; దుష్యంత్‌కు కాంస్యం
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018లో భాగంగా రోయింగ్ విభాగంలో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్ దుష్యంత్ చౌహాన్ కాంస్యం పతకం సాధించాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఫైనల్ హీట్‌లో దుష్యంత్ 7:18: 76 సెకన్లతో వేగవంతమైన టైమింగ్ నమోదు చేసి ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు దుష్యంత్ ఫైనల్‌కు చేరే క్రమంలో 7:43.08 సెకన్లతో హీట్-1ను పూర్తి చేశాడు. ఫలితంగా ఓవరాల్ రెండో స్థానంతో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఆపై ఫైనల్ కూడా ఆకట్టుకున్న దుష్యంత్ కాంస్యంతో మెరిశాడు. గత ఏషియన్ గేమ్స్‌లో సైతం దుష్యంత్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్క్‌లో భారత్‌కు కాంస్యం సాధించింది. భారత రోయర్లు రోహిత్ కుమార్-భగవాన్ సింగ్ జోడి మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించారు. ఫైనల్స్‌లో 07:04:61 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత జట్టు ఇప్పటివరకూ 20 పతకాలను ఖాతాలో వేసుకుంది. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. -
నేషనల్ గేమ్స్ విజేతలకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: కేరళలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
తెలంగాణకు మూడు రజతాలు
రోయింగ్‌లో రాణింపు * ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్‌కు రజతం * జాతీయ క్రీడలు తిరువనంతపురం: తొలిసారి జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్రం పతకాల వేట ప్రారంభించింది. క్రీడల రెండో రోజున రోయింగ్‌లో తెలంగాణకు మూడు రజత పతకాలు లభించాయి. పురుషుల కాక్స్‌వెయిన్స్ లెస్ పెయిర్స్ విభాగంలో మంజీత్ సింగ్-దవీందర్ సింగ్ జంట రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ 2000 మీటర్ల విభాగం ఫైనల్లో జస్కరణ్ సింగ్-కన్నన్ ద్వయం కూడా రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల కాక్స్డ్ ఎయిట్ 2000 మీటర్ల ఫైనల్ రేసులో ప్రశాంత్ నాయర్, హరీష్ పూనాటి, దలీప్ షెఖావత్, అనిల్ సిలోట్, మంజీత్ సింగ్, శ్రీకాంత్ వెల్ది, బీరి సింగ్, ప్రవీణ్, దవీందర్ సింగ్‌లతో కూడిన తెలంగాణ జట్టు రెండో స్థానాన్ని దక్కించుకొని రజతం గెల్చుకుంది. టెన్నిస్ టీమ్ విభాగంలో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విష్ణువర్ధన్, కాజా వినాయక్ శర్మ, షేక్ అబ్దుల్లాలతో కూడిన తెలంగాణ పురుషుల జట్టు 2-0తో హరియాణాపై నెగ్గగా... నిధి చిలుముల, సౌజన్య భవిశెట్టి, ఇస్కా తీర్థలతో కూడిన తెలంగాణ మహిళల జట్టు 2-0తోనే హరియాణా జట్టును ఓడించింది. మరోవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో పతకం లభించింది. తొలి రోజున శ్రీనివాసరావు స్వర్ణం, బంగారు ఉష, వెంకటలక్ష్మీ కాంస్యాలు అందించగా... రెండో రోజున విజయనగరం జిల్లాకే చెందిన రామకృష్ణ 69 కేజీల విభాగంలో రజతం సాధించాడు. రామకృష్ణ స్నాచ్‌లో 124 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 157 కేజీలు ఎత్తి ఓవరాల్‌గా 281 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు -
హైదరాబాదీ సాజి థామస్‌కు అర్జున అవార్డు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రోయింగ్ క్రీడాకారుడు సాజి థామస్, భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సారథ్యంలోని అవార్డుల కమిటీ.. అర్జున అవార్డుకు ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేసింది. అర్జున అవార్డుకు థామస్, అశ్విన్‌తో పాటు షూటర్ హీనా సిద్ధు, అభిషేక్ వర్మ (ఆర్చరీ), టింటూ లూకా (అథ్లెటిక్స్), గిరీశ (పారాలంపిక్స్), దిజు (బ్యాడ్మింటన్), గీతూ ఆన్ జోసె (బాస్కెట్ బాల్), జై భగవాన్ (బాక్సింగ్), అనిర్బన్ (గోల్ఫ్), మమతా పూజారి (కబడ్డీ), అనక అలంకమని (స్వ్కాష్), టామ్ జోసెఫ్ (వాలీబాల్), రేణుబాల చాను (వెయిట్ లిఫ్టింగ్), సునీల్ రానా (రెజ్లింగ్) పేర్లను నామినేట్ చేశారు. కాగా ఖేల్‌రత్న అవార్డుకు ఎవరి పేరును సిఫారసు చేయలేదు. -
నీళ్లలో గెలిచి నీటిపాలు...
ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడం... ఒక క్రీడాకారుడి జీవితంలో అత్యుత్తమ క్షణం...ఆ సమయంలో వారి ఆనందానికి హద్దులుండవు. అయితే సంబరాలు హద్దు దాటితేనే సమస్య... ప్రఖ్యాత రోయర్ వచెస్లావ్ నికోలవిక్ ఇవనోవ్‌కు ఇది అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది. రష్యాకు చెందిన ఈ ఆటగాడు రోయింగ్ (సింగిల్ స్కల్ విభాగం)లో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే అత్యుత్సాహంతో తొలిసారి నెగ్గిన బంగారు పతకాన్ని నీటిపాలు చేశాడు. 1956లో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో రోయింగ్ సింగిల్ స్కల్ విభాగంలో ఇవనోవ్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అయితే పతకం అందుకోగానే 18 ఏళ్ల ఇవనోవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాంతో దాన్ని గాల్లో ఎగిరేసి ఉత్సాహంగా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే చేయి అదుపు తప్పింది. ఆ పతకం దిశ మారి మరో వైపున్న సరస్సులో పడింది. అంతే... ఒక్క క్షణం ఏమీ అర్థం కాని అతను... ఆ వెంటనే తేరుకొని ఆ సరస్సులోకి జంప్ చేశాడు. అయితే ఎంత గాలించినా ఇవనోవ్‌కు పతకం చిక్కలేదు. చివరకు నిర్వాహకులు కూడా గజ ఈతగాళ్లతో వెతికించినా ఫలితం లేకపోయింది. దాంతో బిక్క మొహం వేసుకొని అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత 1960 రోమ్, 1964 టోక్యో ఒలింపిక్స్‌లలో కూడా ఇవనోవ్ ఇదే విభాగంలో మళ్లీ స్వర్ణాలు నెగ్గాడు. అయితే ఈ సారి గాల్లో విసరలేదు.