కేరళలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: కేరళలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు సీఎం కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.