హాంగ్జౌ: గత ఆసియా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన భారత రోయర్లు ఈసారి ఐదు పతకాలు గెలిచి తమ ప్రదర్శనను మెరుగుపర్చుకున్నారు. సోమవారం నాలుగు ఫైనల్స్‌లో భారత క్రీడాకారులు పోటీపడగా... రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. ఆదివారం భారత రోయర్లకు రెండు రజతాలు, ఒక కాంస్యం లభించాయి.
సోమవారం పురుషుల ఫోర్ ఈవెంట్‌లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతకం నెగ్గింది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:08.61 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్ ఈవెంట్‌లో సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్, జకర్ ఖాన్, సుఖ్‌మీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు కాంస్యం గెల్చుకుంది. భారత బృందం 2000 మీటర్ల దూరాన్ని 6ని:10.81 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది.
నాడు తండ్రి... నేడు తనయుడు...
2002 బుసాన్ ఆసియా క్రీడల్లో ఇందర్‌పాల్ సింగ్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. 21 ఏళ్ల తర్వాత ఇందర్‌పాల్ సింగ్ తనయుడు పరిమందర్ సింగ్ తండ్రి ఘనతను అందుకున్నాడు. పర్మిందర్ సభ్యుడిగా ఉన్న భారత జట్టు ఈసారి క్వాడ్రాపుల్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం గెలిచింది.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment