
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టు నేడు జరుగనున్న తుదిపోరులో జపాన్‌తో తలపడనుంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి ఎలాగైనా స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.