స్క్వాష్‌లో పసిడి పోరుకు అమ్మాయిలు సై | India womens team beats Malaysia 2-0 to reach final | Sakshi
Sakshi News home page

స్క్వాష్‌లో పసిడి పోరుకు అమ్మాయిలు సై

Published Fri, Aug 31 2018 1:13 PM | Last Updated on Fri, Aug 31 2018 1:16 PM

India womens team beats Malaysia 2-0 to reach final  - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా స్క్వాష్‌ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప‍్రవేశించింది. శుక‍్రవారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది. జోష్నా చిన్నప్ప, దీపికా పళ్లికల్‌, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్‌ జట్టు.. ఆద్యంతం ఆకట్టకుంది.

ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత బృందం ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత మహిళల స్క్వాష్‌ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే పసిడి పోరులో హాంకాంగ్‌-జపాన్‌ల మధ్య జరుగునున్న రెండో సెమీ ఫైనల్‌ విజేతతో భారత్‌ తలపడనుంది. ఈ రోజు జరిగే స్క్వాష్‌ పురుషుల సెమీ ఫైనల్‌లో భారత్‌ జట్టు హాంకాంగ్‌తో ఆడనుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement