ఏషియన్‌ గేమ్స్‌-2018 : టెన్నిస్‌ సెమీస్‌లో అంకితా రైనా | Manu Bhaker, Rahi Sarnobat Qualified For Finals In Shooting In Asian Games 2018 | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 22 2018 11:13 AM | Last Updated on Sun, Aug 26 2018 3:20 PM

Manu Bhaker, Rahi Sarnobat Qualified For Finals In Shooting In Asian Games 2018 - Sakshi

అంకిత రైనా (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్న టెన్నిస్‌ స్టార్‌ అంకిత రైనా భారత్‌కు మరో పతకం అందించేందుకు అడుగు దూరంలో నిలిచారు. ఏషియన్‌ గేమ్స్‌-2018లో భాగంగా బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గెలుపొంది సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టారు. పాలెంబర్గ్‌లో చైనా ప్లేయర్‌ యూడిస్‌ చోంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట తడబాటుకు గురైన అంకిత అనంతరం దూకుడుగా ఆడి 6-4తో మొదటి సెట్లో గెలుపొందారు. రెండో సెట్లో 6-1 తో గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించారు.

ఏషియన్‌ గేమ్స్‌-2018లో నాలుగోరోజు భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ పోటీల్లో మనుభాకర్‌, రాహి సర్నోబట్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు. 8 మంది ఫైనలిస్టుల్లో చోటు సంపాధించారు. కాగా, 16 ఏళ్ల మనుభాకర్‌ 593 పాయింట్లతో టాప్‌లో, రాహి 580 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement