
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో సింధు 21–10, 12–21, 23–21తో ప్రపంచ 52వ ర్యాంకర్ వు థి ట్రాంగ్ (వియత్నాం)పై కష్టపడి గెలుపొందగా... సైనా 21–7, 21–9తో సొరాయా అఘజియాఘా (ఇరాన్)పై సునాయాసంగా నెగ్గింది.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–16, 21–15తో ఎన్జీ వుంగ్ యుంగ్–వైయుంగ్ ఎన్జీ టింగ్ (హాంకాంగ్)లపై... పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–12, 21–14తో చుంగ్ యాని–టామ్ చున్ హె (హాంకాంగ్)లపై... మనూ అత్రి–సుమీత్ రెడ్డి 21–10, 21–8తో అహ్మద్–రషీద్ (మాల్దీవులు)లపై గెలిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment