
జకార్తా: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కిన పీవీ సింధు.. ఫైనల్ పోరులో తడబడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 13-21, 16-21 తేడాతో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో సింధు పూర్తిస్థాయి ఆటను కనబరచడంలో విఫలమైంది. ఫలితంగా సింధు రజతంతోనే సంతృప్తి పడింది.
వరుస రెండు గేమ్‌లను తై జు యింగ్‌కు సునాయాసంగా కోల్పోయిన సింధు.. మరొకసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. తద్వారా 2016 రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌ని ఓడించిన సింధు ఆ తర్వాత ఆమెతో ఆడిన వరుస ఆరు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైనట్లయ్యింది.
కాగా, ఏషియన్ గేమ్స్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు సాధించింది. ఈ ఆసియా క్రీడల ముందు వరకూ మహిళల, పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన వారు లేదు. ఆసియా క్రీడా బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ ఇప‍్పటివరకూ ఒకే ఒక్క సింగిల్స్ పతకం ఉంది. 1982లో ఢిల్లీలో నిర్వహించిన ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్య గెలిచాడు. ఆ తర్వాత సింగిల్స్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా రాకపోగా, తాజా ఏషియన్ గేమ్స్‌లో సింధు రజత పతకాన్ని సాధించగా, సైనా కాంస్యాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment