ఇండోనేసియా జంటకు ఓ అమ్మాయి జన్మించింది. అది కూడా సరిగ్గా ఆసియా క్రీడలు మొదలైన 18వ తేదీనే కావడం విశేషం. ప్రసవ తేది సెప్టెంబర్‌లో ఉండగా ఓ నెల ముందే కలిగిన ఆ సంతానానికి గేమ్స్ పేరే పెట్టారు. ఇండోనేసియాకు చెందిన యొర్డానియా, వెరనొవా డెని దంపతులు. వీరికి ఇదివరకే ముగ్గురు పిల్లలున్నారు. గర్భంతో ఉన్న యొర్డానియాకు వచ్చే నెల డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు.
ఆశ్చర్యంగా ఆమె 18న ఓ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు మెగా ఈవెంట్‌ను పురస్కరించుకొని ఆ చిన్నారికి ‘అబిదా ఏషియన్ గేమ్స్’ అని పేరు పెట్టారు. అంతేకాదు... తన కుమార్తెను ప్రొఫెషనల్ అథ్లెట్‌గా చేస్తానని వెరనొవా డెని చెప్పారు. ‘ఈ పేరు మా పాప భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తనలో ప్రతిభవుంటే తప్పుకుండా అథ్లెట్‌ను చేస్తా’ అని అన్నారు.
ఆ అమ్మాయి పేరు... ‘ఏషియన్ గేమ్స్’
Published Wed, Aug 22 2018 2:38 AM | Last Updated on Wed, Aug 22 2018 3:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment