
న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో తొలి రోజే భారత్‌కు పసిడి పతకం అందించిన స్టార్ షూటర్ జీతూ రాయ్‌కి ఈసారి మొండిచేయి ఎదురైంది. ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టులో జీతూ రాయ్‌కు స్థానం దక్క లేదు. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో పాల్గొనాలను కున్న తెలంగాణ స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు కూడా నిరాశే ఎదురైంది. తెలంగాణకే చెందిన మహిళా షూటర్ రష్మీ రాథోడ్ స్కీట్ విభాగంలో భారత జట్టులో స్థానాన్ని సంపాదించింది. ఆమె తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడనుంది. ఆసియా క్రీడలకు దూరంకానున్న గగన్ సెప్టెంబర్‌లోనే జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment