
అకాపుల్కో (మెక్సికో): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్‌లో భారత మహిళా షూటర్లు నిరాశ పరిచారు. స్కీట్ ఈవెంట్‌లో ముగ్గురు బరిలోకి దిగినా క్వాలిఫయింగ్‌ను దాటి ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ 112 పాయింట్లు స్కోరు చేసి 23వ ర్యాంక్‌లో... మహేశ్వరి చౌహాన్ 109 పాయింట్లతో 33వ ర్యాంక్‌లో... సిమ్రన్‌ప్రీత్ కౌర్ 97 పాయింట్లతో 48వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ విభాగంలో అమెరికా దిగ్గజ షూటర్ కింబర్లీ రోడ్ స్వర్ణం సాధించింది.
ఫైనల్లో కింబర్లీ 57 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఇప్పటికే కింబర్లీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో... రజత, కాంస్య పతకాలు గెల్చుకున్న చోట్ టిపెల్ (న్యూజిలాండ్), డాంగ్లియన్ జాంగ్ (చైనా)లకు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో 39 ఏళ్ల కింబర్లీ రోడ్‌కిది 19వ పసిడి పతకం కావడం విశేషం. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొని పతకాలు కూడా గెల్చుకున్న కింబర్లీ వచ్చే ఏడాది టోక్యోలో వరుసగా ఏడో పతకంపై దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment