rashmi rathord
-
జాతీయ క్రీడల్లో సత్తా చాటుతున్న తెలుగు తేజాలు
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు ఒక రజత పతకం లభించింది. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్ 25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది. వియత్నాం ఓపెన్‌లో ఆడి శనివారం రాత్రి నేరుగా గుజరాత్ చేరుకున్న సిక్కి రెడ్డి ఆదివారం మధ్యాహ్నం సెమీఫైనల్లో ఆడటం విశేషం. నేడు ఫైనల్లో కేరళతో తెలంగాణ ఆడుతుంది. మహిళల 3్ఠ3 బాస్కెట్‌బాల్ ఈవెంట్లో తెలంగాణ జట్టు ఫైనల్ చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. రజతాలు నెగ్గిన పల్లవి, కార్తీక జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఆదివారం రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్ చేరింది. -
రష్మీ రాథోడ్‌కు నిరాశ
అకాపుల్కో (మెక్సికో): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్లు నిరాశ పరిచారు. స్కీట్ ఈవెంట్లో ముగ్గురు బరిలోకి దిగినా క్వాలిఫయింగ్‌ను దాటి ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ 112 పాయింట్లు స్కోరు చేసి 23వ ర్యాంక్‌లో... మహేశ్వరి చౌహాన్ 109 పాయింట్లతో 33వ ర్యాంక్‌లో... సిమ్రన్ప్రీత్ కౌర్ 97 పాయింట్లతో 48వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ విభాగంలో అమెరికా దిగ్గజ షూటర్ కింబర్లీ రోడ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో కింబర్లీ 57 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఇప్పటికే కింబర్లీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో... రజత, కాంస్య పతకాలు గెల్చుకున్న చోట్ టిపెల్ (న్యూజిలాండ్), డాంగ్లియన్ జాంగ్ (చైనా)లకు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో 39 ఏళ్ల కింబర్లీ రోడ్కిది 19వ పసిడి పతకం కావడం విశేషం. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొని పతకాలు కూడా గెల్చుకున్న కింబర్లీ వచ్చే ఏడాది టోక్యోలో వరుసగా ఏడో పతకంపై దృష్టి పెట్టింది. -
తెలంగాణ షూటర్ రష్మీకి చోటు
న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో తొలి రోజే భారత్‌కు పసిడి పతకం అందించిన స్టార్ షూటర్ జీతూ రాయ్‌కి ఈసారి మొండిచేయి ఎదురైంది. ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టులో జీతూ రాయ్‌కు స్థానం దక్క లేదు. వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో పాల్గొనాలను కున్న తెలంగాణ స్టార్ షూటర్ గగన్ నారంగ్‌కు కూడా నిరాశే ఎదురైంది. తెలంగాణకే చెందిన మహిళా షూటర్ రష్మీ రాథోడ్ స్కీట్ విభాగంలో భారత జట్టులో స్థానాన్ని సంపాదించింది. ఆమె తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడనుంది. ఆసియా క్రీడలకు దూరంకానున్న గగన్ సెప్టెంబర్‌లోనే జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో స్థానాన్ని దక్కించుకున్నాడు. -
రష్మీకి స్వర్ణం
జాతీయ సీనియర్ షూటింగ్ న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రష్మీ రాథోడ్ స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంట్లో రష్మీ విజేతగా నిలిచింది. ఆర్తి సింగ్ (ఎయిరిండియా) రజతం సాధించగా... సమియా షేక్ (చత్తీస్‌గఢ్) కాంస్యం గెల్చుకుంది. రష్మీ మొత్తం 60 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత విజయ్ కుమార్ పసిడి పతకాన్ని నెగ్గాడు. పురుషుల స్కీట్ టీమ్ ఈవెంట్లో అమిత్ సంఘీ, వికార్ అహ్మద్, శ్రేయన్ కపూర్లతో కూడిన ఆంధ్రప్రదేశ్ బృందానికి కాంస్యం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో శ్రేయన్ కపూర్‌కు కాంస్య పతకం దక్కింది.