Shotgun
-
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
ఒలింపిక్స్‌కు భారత షాట్‌గన్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో కూడిన భారత షాట్‌గన్ జట్టును ప్రకటించారు. జట్టులోకి ఎంపికైన ఐదుగురూ తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. పురుషుల ట్రాప్ విభాగంలో పృథ్వీరాజ్ తొండైమన్... మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరి కుమారి... పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్ సింగ్ నరూకా... మహిళల స్కీట్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. స్కీట్ మిక్స్డ్ విభాగంలో అనంత్, మహేశ్వరి పోటీపడతారు. 37 ఏళ్ల పృథ్వి రాజ్ ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీల్లో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 21 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు. -
భారత షాట్‌పుట్ క్రీడాకారుడిపై నాలుగేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: డోపింగ్ పరీక్షలో విఫలమైన భారత షాట్‌పుట్ క్రీడాకారుడు నవీన్ చికారాపై అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘం (ఐఏఏఎఫ్) ఇంటెగ్రిటీ విభాగం నాలుగేళ్ల నిషేధాన్ని విధించింది. 2018 జూలైలో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నవీన్ విఫలమైనట్లు ఐఏఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో అతనిపై నిషేధం జూలై 27, 2018 నుంచి అమలులోకి వస్తుందంటూ ఐఏఏఎఫ్ తన తాజా ప్రకటనలో తెలిపింది. ‘నాడా’ అతని శాంపిల్స్‌ను సేకరించి కెనడాలోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)కు పంపగా... అక్కడ జరిపిన పరీక్షల్లో నవీన్ నిషేధిత ఉత్ప్రేరకం జీహెచ్‌ఆర్‌పీ–6 వాడినట్లు తేలింది. అనంతరం జీహెచ్‌ఆర్‌పీ–6 నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్నట్లు తనకు అవగాహన లేదని నవీన్ వివరణ ఇచ్చాడు. 23 ఏళ్ల నవీన్ 2018 ఫెడరేషన్ కప్‌లో రజత పతకంతో పాటు... అదే ఏడాది జరిగిన అంతర్రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. -
రష్మీ రాథోడ్‌కు నిరాశ
అకాపుల్కో (మెక్సికో): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నమెంట్లో భారత మహిళా షూటర్లు నిరాశ పరిచారు. స్కీట్ ఈవెంట్లో ముగ్గురు బరిలోకి దిగినా క్వాలిఫయింగ్‌ను దాటి ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ 112 పాయింట్లు స్కోరు చేసి 23వ ర్యాంక్‌లో... మహేశ్వరి చౌహాన్ 109 పాయింట్లతో 33వ ర్యాంక్‌లో... సిమ్రన్ప్రీత్ కౌర్ 97 పాయింట్లతో 48వ ర్యాంక్‌లో నిలిచారు. ఈ విభాగంలో అమెరికా దిగ్గజ షూటర్ కింబర్లీ రోడ్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో కింబర్లీ 57 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఇప్పటికే కింబర్లీ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో... రజత, కాంస్య పతకాలు గెల్చుకున్న చోట్ టిపెల్ (న్యూజిలాండ్), డాంగ్లియన్ జాంగ్ (చైనా)లకు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. ప్రపంచకప్ టోర్నీల్లో 39 ఏళ్ల కింబర్లీ రోడ్కిది 19వ పసిడి పతకం కావడం విశేషం. వరుసగా ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొని పతకాలు కూడా గెల్చుకున్న కింబర్లీ వచ్చే ఏడాది టోక్యోలో వరుసగా ఏడో పతకంపై దృష్టి పెట్టింది. -
గ్రహశకలాలను పేల్చేసే.. స్పేస్ షాట్‌గన్
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రపంచంలోనే తొలిసారిగా తొలి స్పేస్ షాట్ గన్ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్ని ఈ షాట్గన్తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్(ఏఆర్ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం. 'ఆస్టరాయిడ్స్.. ఓ హాట్ టాపిక్. భూమికి ప్రమాదం తెస్తాయని మాత్రమే కాదు, వాటికున్న శాస్త్రీయ విలువ ఆధారంగా కూడా. అంగారకుడి దిశగా నాసా ప్రయత్నాల్లో ఇది ఒక ముందడుగు' అని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ గ్రీన్ జిమ్ తెలిపారు. -
లాలూపై 'షాట్ గన్' సానుభూతి
పాట్నా: దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడంపై బీజేపీ సీనియర్ నాయకుడు శత్రుఘ్న సిన్హా సానుభూతి వ్యక్తం చేశారు. ఎగువ కోర్టు తీర్పుతో ఆయన త్వరలో జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. లాలూ స్నేహితుడిగా ఆయన జైలుకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేపోతున్నానని పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. క్లిష్టపరిస్థితుల నుంచి లాలూ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. బాలీవుడ్లో షాట్ గన్‌గా పేరుగాంచిన శత్రుఘ్న సిన్హా అనేక సందర్భాల్లో పార్టీని ఇబ్బందులకు గురిచేసే విధంగా మాట్లాడారు. తాజాగా లాలూకు అనుకూలంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి. అయితే లాలూతో ఆయనకు రాజకీయాల్లోకి రాకముందునుంచే స్నేహం ఉంది. పాట్నా యూనివర్సిటీలో శత్రుఘ్న సిన్హాకు లాలూ సీనియర్. పాట్నా లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.