న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్‌లో పాల్గొనే ఐదుగురు సభ్యులతో కూడిన భారత షాట్‌గన్ జట్టును ప్రకటించారు. జట్టులోకి ఎంపికైన ఐదుగురూ తొలిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. పురుషుల ట్రాప్ విభాగంలో పృథ్వీరాజ్ తొండైమన్... మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరి కుమారి... పురుషుల స్కీట్ ఈవెంట్‌లో అనంత్‌జీత్ సింగ్ నరూకా... మహిళల స్కీట్ ఈవెంట్‌లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
స్కీట్ మిక్స్‌డ్ విభాగంలో అనంత్, మహేశ్వరి పోటీపడతారు. 37 ఏళ్ల పృథ్వి రాజ్ ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీల్లో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో కలిపి భారత్ నుంచి మొత్తం 21 మంది షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment