జకార్తా: ఏషియన్ గేమ్స్ వంటి మెగా టోర్నీల్లో పతకాలు సాధించడమనేది ప్రతీ అథ్లెట్ కల. ఇందుకోసం వారు సంవత్సరాలు పాటు చెమటోడ్చి మరీ సిద్దమవుతారు. ఇక్కడ తృటిలో పతకం చేజారిపోతేనే ఆయా అథ్లెట్ల బాధ అంతా ఇంతా కాదు.. మరి వచ్చిన పతకం చేజారిపోతే.. అది మాటల్లో చెప్పలేని మనోవ్యథగా మిగిలిపోతుంది. తాజా ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ఇలానే పతకం చేజార‍్చుకున్నాడు. ఒక చిన్నపొరపాటుతో డిస్ క్వాలిఫై అయి పతకాన్ని కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే... ఆదివారం జరిగిన పదివేల మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ గోవిందన్ లక్ష్మణన్ ఫైనల్ రేసులో పాల్గొన్నాడు. అయితే ఆ రేసును అర గంటలోపే ముగించి మూడో స్థానంలో నిలిచాడు. ఇక‍్కడ తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన బెహ్రయిన్ స్ప్రింటర్ చాని హసన్‌తో రేసును పూర్తి చేసే సమయంతో పోల్చితే గోవిందన్ దాదాపు నిమిషం వెనుకబడ్డాడు. దాంతో స్వర్ణం పతకం సాధించే అవకాశాన్ని స్వల్ప తేడాలో కోల్పోయాడని భారత అభిమానులు భావించారు. కనీసం కాంస్య పతకం సాధించాడు కదా అని సరిపెట్టుకున్నారు. కాగా, ఆ పతకం కూడా పోయింది. రేసు పూర్తి చేసే క‍్రమంలో ‘ట్రాక్’ తప్పడంతో అతనికి వచ్చిన పతకం చేజారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment