ఏషియన్‌ గేమ్స్‌లో సత్తా చాటిన హిమదాస్‌ | Hima Das WonThe Silver Medal In Asian Games | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 26 2018 6:20 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఏషియన్‌ గేమ్స్‌లో హిమదాస్‌ సత్తా చాటింది. హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఈ అస్సాం అమ్మాయి రజతం కైవసం చేసుకుంది. అథ్లెటిక్స్‌ 400 మీటర్ల విభాగంలో 50.79 సెకన్లలో పరుగును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత అథ్లెట్‌ నిర్మల నాలుగోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 52.96 సెకన్లలో పరుగును పూర్తి చేసి తృటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది. ఇక అగ్రస్థానంలో నిలిచిన బెహ్రెయిన్‌ క్రీడాకారిణి నాసెర్‌ సల్వా 50.09 సెకన్లలో పరుగును పూర్తిచేసి స్వర్ణం కైవసం చేసుకుంది. కజకిస్తాన్‌ క్రీడాకారిణి మికినా ఎలినా 52.63 సెకన్లలో పరుగును పూర్తి చేసి కాంస్యం దక్కించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement