ఏషియన్ గేమ్స్ 2018లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా.. రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చతికిలబడింది. దాంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఏషియన్ గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది. ఫలితంగా కాంస్యంతోనే సరిపెట్టుకుంది.