
భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన రాణి రాంపాల్ బృందం బుధవారం జరిగిన సెమీస్‌లో 1–0తో చైనాను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 1998లో చివరిసారి భారత్ ఫైనల్‌కు చేరి స్వర్ణం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (52వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేసింది. శుక్రవారం జరిగే తుదిపోరులో జపాన్‌తో భారత్ తలపడనుంది.
నేడు పురుషుల హాకీ సెమీఫైనల్
డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు నేడు సెమీఫైనల్ బరిలో దిగనుంది. పూల్ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన భారత్... పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతున్న శ్రీజేశ్ సేన ఈ మ్యాచ్‌లోనూ అదే మంత్రంతో ఆడి తుదిపోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. హాకీ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక గోల్స్(76) కొట్టిన ఘనతను భారత జట్టు ఈ మెగా ఈవెంట్‌లో సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment