![Ohh Madhiriga Saagey Lyrical Song Out From Sindhooram Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/7/sindooram.jpg.webp?itok=UHgLxjzU)
శివ బాలాజీ, ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట (ఆనందమో..అవేశమో)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. "ఓ మాదిరిగా" అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం తమకుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా అన్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment