Sindhooram Movie
-
సిగరేట్ పెట్టెపై ‘అర్థశతాబ్దపు..’ పాట రాశాడు : కృష్ణవంశీ
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. శాస్త్రిని ఆయన గురువుగా చెప్పుకుంటారు. శాస్త్రి కూడా కృష్ణవంశిని దత్త పుత్రుడు అని సంభోధించేవాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రి లిరిక్స్ అందించాడు. కొన్ని పాటలు అయితే ఇప్పటికీ మర్చిపోలేం. అందులో ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా’ అనే పాట ఒకటి. ఆ పాట అప్పుడే కాదు ఇప్పుడు విన్నా గూస్బంప్స్ వచ్చేస్తాయి. ఇంత గొప్ప పాటను రాయడానికి సీతారామ శాస్త్రి కేవలం గంట సమయం మాత్రమే తీసుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ తెలిపాడు. అంతేకాదు ఆ పాటని రోడ్డు మీద పడేసిన సిగరేట్ పెట్టమీద రాశాడట. ‘ఆర్జీవీ తెరకెక్కించిన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘అంతం’ సినిమాల ద్వారా శాస్త్రితో నాకు స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత నేను దర్శకత్వం వహించిన సినిమాలన్నింటికి శాస్త్రిగారితో లిరిక్స్ రాయించుకున్నాను. నా ప్రతి సినిమా కథను ముందుగా శాస్త్రికి చెప్పడం అలవాటు. అలాగే కాపీ వచ్చిన తర్వాత కూడా ఆయనకే చూపించేవాడిని. అలా సింధూరం సినిమా కాపీని ఆయనకు చూపించాను. అది చూసిన తర్వాత శాస్త్రి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ‘ఏంటి గురువుగారు’ అంటే ‘పేపర్ ఏదైనా ఉందా?’అని అడిగాడు. అప్పుడు నా దగ్గర పేపర్ లేదు. దీంతో రోడ్డు మీద సిగరెట్ పెట్టె పడి ఉంటే తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసుకొని..వెంటనే ఇంటికెళ్లి గంటలో పాట రాసిచ్చాడు. అంతేకాదు ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు.. సినిమాలో ఫలాన చోట ఈ పాట రావాలి’అని చెప్పారు. ఇదంతా సినిమా విడుదలకు రెండు రోజుల ముందు జరిగింది. ఏం చేయాలో అర్థం కాక..బాలు దగ్గరికి వెళ్లి చెప్పాను. చివరకు రికార్డు చేసి విడుదల చేశాం. రిలీజ్ తర్వాత సినిమాకు అదే కీలకం అయింది’ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ‘నిన్నే పెళ్లాడతా సినిమాలో ‘కన్నుల్లో నీ రూపమే’ పాట సందర్భం వివరిస్తూ.. ‘హీరో హీరోయిన్ల ఇళ్లల్లో పెద్దవాళ్లు లేరు. వారిద్దరు కలవాలి.ఎంతైనా చెప్చొచ్చు.. కానీ ఏమి చెప్పకూడదు’అని చెబితే.. ‘నువ్వు నాశనం.. నేను నాశనం’ అని వ్యంగ్యంగా నన్ను తిడుతూ శాస్త్రిగారు ‘కన్నుల్లో నీ రూపమే’ పాట రాశారు’అని కృష్ణవంశీ చెప్పారు. -
Sindhooram Reviw: ‘సిందూరం’ మూవీ రివ్యూ
టైటిల్: సిందూరం నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ తదిరులు నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా దర్శకుడు: శ్యామ్ తుమ్మలపల్లి సంగీతం: గౌవ్రా హరి సినిమాటోగ్రఫీ: కేశవ్ ఎడిటర్: జస్విన్ ప్రభు విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2023 ప్రాంతంలో సాగుతుంది. ఖమ్మం జిల్లా పినపాకకు చెందిన రవి (ధర్మ), శిరీష (బ్రిడిగా సాగా) కాలేజీలో మంచి స్నేహితులు. చదువు పూర్తయ్యాక శిరీష ఎమ్మార్వో ఉద్యోగం సాధించి సొంత ఊరికి వెళ్తుంది. ధర్మ బాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించాలని కలలు కంటాడు. అయితే కారణం చేత ధర్మ బాడ్మింటన్‌కి దూరమై నక్సలైట్ సానుభూతిపరుడిగా మారతాడు. శిరీష ఎమ్మార్వో ఉద్యోగం వదిలేసి సొంత ఊరు శ్రీరామగిరి జెడ్పీటీసీగా పోటీ చేస్తుంది. దీంతో శిరీషను అదే ప్రాంతంలోని సింగన్న (శివబాలాజీ) దళం టార్గెట్ చేస్తుంది. అసలు శిరీష ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ఆమెను సింగన్న దళం ఎందుకు టార్గెట్ చేసింది? బాడ్మింటన్ కావాలనుకున్న ధర్మ ఎందుకు నక్సల్స్‌తో చేతులు కలిపాడు? శిరీష అన్న, రాజకీయ నేత ఈశ్వరయ్య(రవి వర్మ)ను చంపింది ఎవరు? పోలీసులకు, నక్సల్స్ మధ్య జరిగిన పోరులో ఎవరు బలైయ్యారు? చివరకు రవి తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం బ్రిగిడ సాగా పోషించిన పాత్ర. శిరీషగా అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. అలాగే రవి పాత్రలో ధర్మ ఒదిగిపోయాడు. తొలి చిత్రమే అయినా చక్కగా నటించాడు. చాలా బరువైన పాత్ర తనది. క్లైమాక్స్‌లో ఆయన చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. శివ బాలాజీ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. ఈశ్వరయ్య పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చిరంజీవి అభిమానిగా జోష్ రవి నవ్వించే ప్రయత్నం చేశాడు. అలా సినిమాలోని పాత్రలన్నీ తమ పరిధి మేరకు నటించాయి. ఎలా ఉందంటే... నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. సిందూరం కూడా ఆ తరహా చిత్రమే. 90 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు సంఘటనలు, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. నక్సల్స్, పోలీసుల మధ్య నలిగిపోయిన ప్రజల జీవితాలు, రైతుల వ్యధలను తెరపై కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ టచ్ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు ఎర్రజెండా ప్రేమికులకు ఇబ్బందిగా ఉంటాయి. పస్టాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. కానీ సెకండాఫ్ మెప్పిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
ఈ ఏడాదికి స్టార్ హీరోలు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి బరిలో దిగిన బడా హీరోల సినిమాలన్నీ సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ముగిసిపోయింది. దాదాపు రెండు వారాల తర్వాత కొత్త సినిమాలు థియేటర్లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాయి. మరి జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లో సందడి చేసే సినిమాల జాబితా.. ♦ పఠాన్ - జనవరి 25 ♦ హంట్ - జనవరి 26 ♦ గాంధీ.. గాడ్సే.. ఏక్ యుధ్ - జనవరి 26 ♦ సిందూరం - జనవరి 26 ♦ Who Am I - జనవరి 27 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లివే! ఆహా ♦ 18 పేజెస్ - జనవరి 27 అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ ఎంగ్గా హాస్టల్ (తమిళ్) - జనవరి 27 ♦ షాట్‌గన్ వెడ్డింగ్ (హాలీవుడ్)- జనవరి 27 ♦ యాక్షన్ హీరో (హిందీ) - జనవరి 27 హాట్‌స్టార్ ♦ ఎక్స్ట్రార్డినరీ (వెబ్‌సిరీస్) - జనవరి 25 ♦ డియర్ ఇష్క్(హిందీ) - జనవరి 26 ♦ సాటర్ డే నైట్ (మలయాళం) - జనవరి 27 నెట్‌ఫ్లిక్స్ ♦ నార్విక్(హాలీవుడ్) - జనవరి 23 ♦ బ్లాక్ సన్‌షైన్ బేబీ(డాక్యుమెంటరీ) - జనవరి 24 ♦ 18 పేజెస్ - జనవరి 27 జీ5 ♦ అయలీ (తెలుగు/తమిళ సిరీస్) - జనవరి 26 ♦ జాన్బాజ్ హిందుస్థాన్ కీ (హిందీ,తెలుగు, తమిళ్) - జనవరి 26 -
Sindhooram: ఆకట్టుకుంటున్న ‘ఓ మాదిరిగా సాగే నా జీవితం..’ సాంగ్
శివ బాలాజీ, ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట (ఆనందమో..అవేశమో)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. "ఓ మాదిరిగా" అంటూ సాగే ఈ పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరుశురాం గారు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట చాలా బాగుంది అని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందని, సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం బాగుందని, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం తమకుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా అన్నారు. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న ‘ఆనందమో ఆవేశమో..’ మెలోడీ సాంగ్
శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సిందూరం. ఈ సినిమా లోని మొదటి పాటను తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ‘ఆనందమో ఆవేశమో..’ అంటూ సాగే ఈ మెలోడీకి బాలాజీ లిరిక్స్ అందించగా, సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ అద్భుతంగా ఆలపించారు. హరి గౌర సంగీతం సమకూర్చాడు. హీరోహీరోయిన్ల మధ్య లవ్ సాంగ్ గా చిత్రీకరించిన ఈ పాట వినడానికి ఎంతో మనోహరంగా ఉంది. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి సైతం ఈ సాంగ్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు.