సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు కష్టకాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేపు(శుక్రవారం) హస్తం గూటికి చేరుతున్నారు.
కాగా, సీఎం రేవంత్ సమక్షంలో రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ప్రకాశ్ గౌడ్‌తో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక, ప్రకాశ్ గౌడ్ చేరికలో కాంగ్రెస్‌లోకి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment