
రాజేంద్ర నగర్ నియోజకవర్గం
రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన టి.ప్రకాష్ గౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది గణేష్ గుప్త పై 57331 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహాకూటమిలో భాగంగా ఈ సీటును టిడిపికి కేటాయించారు. ప్రకాష్ గౌడ్ గతంలో రెండుసార్లు వరసగా టిడిపి తరపున గెలిచారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన టిఆర్‌ఎస్ లో చేరిపోయారు. 2018లో టిఆర్‌ఎస్ పక్షానే పోటీచేసి మరోసారి విజయం సాదించారు.ప్రకాష్ గౌడ్‌కు 106676 ఓట్లు రాగా, గణేష్ గుప్తాకు 49345 ఓట్లు వచ్చాయి.
ఇక్కడ ఎమ్.ఐ.ఎమ్. అభ్యర్దిగా పోటీచేసిన మిరాజ్ బేగ్‌కు 46 వేల కుపైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో ఉన్నారు. ప్రకాష్ గౌడ్ సామాజికపరంగా గౌడ వర్గానికి చెందినవారు. 2014లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన జ్ఞానేశ్వర్‌పై 25881 ఓట్ల తేడాతో టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. 2009 లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో వరసగా మూడుసార్లు బిసి గౌడ్ వర్గం నేతగా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు.
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..