
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అకస్మాత్తుగా అస్వస‍్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శంషాబాద్‌లోని ఓ హాటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం అక్కడికి వెళ్లారు. అయితే ప్రారంభోత్సవం జరుగుతుండగా ఎమ్మెల్యే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అస్వస్థతకు గురైన ప్రకాశ్ గౌడ్‌ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే ఎమ్మెల్యే పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు నగరంలోని నిమ్స్‌కు తరలించినట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment