ప్లోర్‌ లీడర్‌గా ఎమ్మెల్యే రేవంత్‌.. | Telangana TDP MLA revanth reddy to be announced as Floor leader | Sakshi
Sakshi News home page

ప్లోర్‌ లీడర్‌గా ఎమ్మెల్యే రేవంత్‌..

Published Wed, Feb 10 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

ప్లోర్‌ లీడర్‌గా ఎమ్మెల్యే రేవంత్‌..

ప్లోర్‌ లీడర్‌గా ఎమ్మెల్యే రేవంత్‌..

-  నేడు టీడీపీ పక్ష నేత గా ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ప్రకటన
- టీడీపీ నుంచి ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్ గౌడ్‌ సస్పెన్షన్‌


హైదరాబాద్‌: టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు టీఆర్ఎస్ లో చేరడంతో ఖంగుతిన్న టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎర్రబెల్లితో సంప్రదింపులు జరపాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండు చేయాలను నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎర్రబెల్లి అసెంబ్లీ లో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి ని టీడీపీ పక్ష నేతగా నిర్ణయించారు. గురువారం టీడీపీ నేతలతో టెలి కాన్ఫిరేన్స్‌ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ కు రానున్నారు. ఈ సమావేశంలో రేవంత్‌ను ప్లోర్‌ లీడర్‌గా చంద్రబాబు ప్రకటించనున్నారు.

కాగా, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, వివేకానంద, ప్రకాశ్‌ గౌడ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినందుకుగానూ ఎర్రబెల్లితో పాటు ప్రకాష్ గౌడ్, వివేకానందలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, కొంతమంది అవకాశవాదులు ప్యాకేజీలకు, పదవులకు, పనులకు ఆశపడి పార్టీని వీడారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్‌ రమణ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ, అనేక సంక్షోభాలు వచ్చినా పార్టీని కార్యకర్తల సహాయంతో ధీటుగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇది కార్యకర్తల పార్టీగా అభివర్ణించారు. టీడీపీ సిద్ధాంతాలు ఎన్టీఆర్‌ ఆశయాలు, చంద్రబాబు నాయుడు విధానాలు తెలంగాణకు అవసరమనీ, పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. నాయకులు తమ స్వార్థంతో పార్టీని వీడినా.. కార్యకర్తలు పార్టీతోనే ఉంటారని ఎల్‌ రమణ వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement