'మాట తప్పారు... అందుకే మనసు మార్చుకున్నా'
మణికొండ (రంగారెడ్డి జిల్లా): రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు మూడు నెలల్లో తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఇచ్చిన మాట తప్పారని... దాంతో పార్టీ మారే విషయంలో తాను మనసు మార్చుకున్నాని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజేంద్రనగర్ మండల పరిధిలో నీటి సమస్యపై కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తున్నా... మాటలే చెపుతున్నారు తప్ప చేతల్లో చూపటం లేదన్నారు. శనివారం ఉదయం మంత్రి హరీష్‌రావుతో ఇదే విషయంలో చర్చించగా మూడు రోజుల్లో నీటిని ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇలా నీటి విషయంలో వారు మాట తప్పటంతో... తాను పార్టీ మారే విషయంలో మనసు మార్చుకున్నానని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి విషయంలో ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలను కొనే స్థోమత లేదన్నారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు తేలుతాయన్నారు.