ముషీరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ సునీత భర్త ప్రకాష్ గౌడ్ (55) మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బంజరాహిల్స్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున 3 గంటలకు మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అంత్యక్రియలు పార్శిగుట్టలోని గౌడ స్మశాన వాటికలో జరిగాయి.
ఈనెల 7న అడిక్‌మెట్ కార్పొరేటర్ కార్యాలయాన్ని రాంనగర్ మీసేవా కేంద్రం పైన ఉన్న వార్డు కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ప్రకాష్ గౌడ్ సాయంత్రానికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కరోనాగా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.
డైనమిక్ లీడర్
► నియోజకవర్గంలో డైకమిక్ లీడర్‌గా ప్రకాష్ గౌడ్ పేరు తెచ్చుకున్నారు. యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవారు. ఆ దూకుడుతోనే అనతి కాలంలో ముఖ్య నాయకుడుగా ఎదిగారు. గాందీభవన్‌లో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతుండగా ఆందోళన చేసి సస్పెన్షన్‌కు గురయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 15 ఏళ్లుగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు మెట్లెక్కడంతో ప్రభుత్వం 2002లో ఎన్నికలను నిర్వహించింది. కార్పొరేషన్ ఎన్నికల ముందు 2020లో ఆయన బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయనన భార్య సునీత కార్పొరేటర్‌గా విజయం సాధించారు.
పలువురి సంతాపం
► ప్రకాష్ గౌడ్ మృతి వార్త తెలుసుకున్న పలువురు నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. బీజేపీ శ్రేణులు రాంనగర్, అడిక్‌మెట్ తదితర ప్రాంతాల్లో ఆయన చిత్రాపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆరి్పంచారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, రాంనగర్ మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎం.ఎన్.శ్రీనివాస్ రావు, జాతీయ దళిత నాయకులు గజ్జల సూర్యనారాయణ, బీజేపీ అసెంబ్లీ కనీ్వనర్ రమేశ్ రాం, బీజేపీ చెందిన పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలియజేశారు.
( చదవండి: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కనబడడం లేదు.. )
Comments
Please login to add a commentAdd a comment